హీరోయిన్ శృతి హాసన్ హాసన్ చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద ఆఫర్స్ లేవు. తెలుగులో రవితేజ సరసన క్రాక్ మూవీ చేస్తున్న శృతి హాసన్...వకీల్ సాబ్ మూవీలో పవన్ భార్య రోల్ చేస్తున్నారు. వకీల్ సాబ్ లో శృతి హాసన్ ది కేవలం క్యామియో రోల్ మాత్రమే. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన లాభం మూవీలో కూడా శృతి హాసన్ నటించడం జరిగింది. ఒకప్పుడు స్టార్ హీరోల బెస్ట్ ఛాయిస్ గా ఉన్న శృతి హాసన్ కి ఆ స్థాయి అవకాశాలు రావడం లేదు. 

శృతి హాసన్ కెరీర్ గాడితప్పడానికి కారణం ఆమె లవ్ ఎఫైర్. లండన్ కి చెందిన మైకేల్ కోర్సలే అనే వ్యక్తిని ఘాడంగా ప్రేమించిన శృతి హాసన్ కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది. పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వస్తున్న తరుణంలో మైకేల్ కోసం వాటిని వదులుకుంది. దానివలన దర్శక నిర్మాతల ఛాయిస్ లిస్ట్ లో శృతి హాసన్ లేకుండా పోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో శృతి హాసన్ తనకు సినిమా అవకాశాలు తగ్గడానికి గల కారణం చెప్పుకొచ్చింది. 

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ ఛాట్ చేసిన శృతి హాసన్ తన ముక్కుసూటి తనం కూడా సినిమా అవకాశాలు కోల్పోవడానికి ఒక కారణం అన్నారు. కెరీర్ బిగినింగ్ లో అవకాశాల కోసం అనేక ఇబ్బందులు పడినట్లు శృతి హాసన్ చెప్పారు. ఎంతటి వారైనా, వాళ్లకు ఎంత గొప్ప హిట్ ట్రాక్ ఉన్నా పాత్ర నచ్చక పోతే ముఖం మీదే చెప్పేసే వారట. అవకాశాల కోసం స్వాభిమానం, ఆత్మ గౌరవం అమ్ముకోలేదని అన్నారు. 

ఇలాంటి అనేక కారణాల వలన శృతి హాసన్ కెరీర్ లో అనేక సార్లు సినిమా అవకాశాలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ఇక శృతి హాసన్ నటించిన క్రాక్, లాభం చిత్రాలు విడుదల కావాల్సి వుంది.  వకీల్ సాబ్ మూవీలో ఓ పాట మరియు కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో శృతి పాల్గొనాల్సి ఉందని సమాచారం.