Asianet News TeluguAsianet News Telugu

శృతి హాసన్‌ ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌తో రొమాన్స్.. `సలార్‌`లో హీరోయిన్‌గా ఫైనల్‌.. ఫ్యాన్స్ కి బిగ్‌ సర్‌ప్రైజ్‌

శృతి హాసన్‌ ఫ్యాన్స్ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు `సలార్‌` టీమ్‌. ఈ సెక్సీ బ్యూటీని బిగ్‌ ప్రాజెక్ట్ లోకి ఎంపిక చేశారు. `సలార్‌`లో ప్రభాస్‌తో రొమాన్స్ చేసే హీరోయిన్‌గా ఈ `క్రాక్‌` బ్యూటీని ఫైనల్‌ చేశారు. నేడు(గురువారం) శృతి హాసన్‌ బర్త్ డే. ఈ సందర్భంగా `సలార్‌` టీమ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. 

shruti haasan as heroine in prabhas salaar final and gave  birthday gift to fans  arj
Author
Hyderabad, First Published Jan 28, 2021, 10:23 AM IST

శృతి హాసన్‌ ఫ్యాన్స్ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు `సలార్‌` టీమ్‌. ఈ సెక్సీ బ్యూటీని బిగ్‌ ప్రాజెక్ట్ లోకి ఎంపిక చేశారు. `సలార్‌`లో ప్రభాస్‌తో రొమాన్స్ చేసే హీరోయిన్‌గా ఈ `క్రాక్‌` బ్యూటీని ఫైనల్‌ చేశారు. నేడు(గురువారం) శృతి హాసన్‌ బర్త్ డే. ఈ సందర్భంగా `సలార్‌` టీమ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మాత. 

ఈ సినిమాని ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తాజాగా హీరోయిన్‌ని ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం రామగుండంలోని సింగరేణిలో పెద్ద సెట్‌ వేస్తున్నారని, అది పూర్తి కాగానే షూటింగ్‌ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాని ప్రారంభించనున్నారట. దాదాపు పది రోజులపాటు ఈ షూటింగ్‌ ఉంటుందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఓ నాయకుడి కథతో ఈ సినిమా సాగుతుందట. 

శృతి హాసన్‌ ఇటీవల రీఎంట్రీ ఇస్తూ `క్రాక్‌` చిత్రంతో సూపర్‌ హిట్‌ని అందుకుంది. ప్రస్తుతం `వకీల్‌సాబ్‌`లో నటిస్తుంది. తాజాగా `సలార్‌` వంటి బిగ్‌ ప్రాజెక్ట్ లో ఎంపిక కావడం విశేషం. దీంతో ప్రస్తుతం ఫుల్‌ యాక్టివ్‌లో ఉన్న స్టార్‌ హీరోయిన్లకి శృతి గట్టిగానే కాంపిటీషన్‌ ఇవ్వబోతుందని చెప్పొచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios