పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన శృతిహాసన్

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన శృతిహాసన్

సౌత్‌ హీరోయిన్ శృతిహాసన్ మ్యారేజ్ ఆలోచన ఎంతవరకు వచ్చింది? ఈ ఏడాదిలో తన బాయ్‌ఫ్రెండ్‌, నటుడు మైఖేల్ కోర్సలేని పెళ్లి చేసుకుంటుందా? ఆ తర్వాత గ్లామర్ ఇండస్ర్టీకి గుడ్ బై చెప్పేస్తుందా? ఇలా రకరకాల ప్రశ్నలు ఆమె అభిమానులను కొన్నాళ్లుగా వెంటాడాయి. ఒకానొక దశలో శృతి లవ్ మ్యారేజ్‌కి పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని, అందుకే సినిమాలకు డేట్స్ ఇవ్వలేదని ప్రచారం లేకపోలేదు. ఈ క్రమంలో అభిమానులతో ఇంటరాక్ట్ అయి, వాళ్ల సందేహాలను నివృతి చేసింది.
తన మ్యారేజ్ ప్లాన్ గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, హ్యాపీగా వుండాలన్నదే తన డ్రీమ్ అంటూ మనసులోని మాట బయటపెట్టింది. గతేడాది రిలీజైన కాటమరాయుడు తర్వాత టాలీవుడ్‌లో కనిపించడం మానేసింది. ఈలోగా బాయ్‌ఫ్రెండ్‌తో ఆమె కనిపించడంతోరకరకాల వార్తలు హంగామా చేశాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ ఫిల్మ్ చేస్తోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page