బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్‌ కోణం గురించి తెలియడంతో ఈ విషయంపై కూడా దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి  విచారణలో పలువురి పేర్లు వెల్లడించిందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,సారా అలీ ఖాన్  పేరు కూడా ఉందని ఓ జాతీయ మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో పేరు ఈ లిస్ట్ లో చేరింది. ఆమె మరెవరో కాదు..ప్రభాస్ తో సాహా సినిమాలో చేసిన శ్రద్దా కపూర్. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. 

 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారుల విచారణలో రియా కొత్త విషయాలను వెల్లడించింది. డ్రగ్ వ్యహారాలన్నీ ముంబై సమీపంలో సుశాంత్ కు చెందిన లోనాల్వా ఫామ్ హౌస్ లో జరిగేవని రియా వెల్లడించింది. సుశాంత్ ఫామ్ హౌస్ లో నిర్వహించే డ్రగ్ పార్టీలకు బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు యాక్టర్స్ డైరెక్టర్స్ మరియు అతని స్నేహితులు హాజరయ్యేవారని ఆమె చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా  మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ పార్టీలో శ్రద్దాకపూర్ కూడా పాల్గొన్నారనే విషయాన్నివెల్లడించారు.

మార్చి 28వ తేదీన చిచ్చోరే చిత్రం విజయాన్ని   పురస్కరించుకొని ఫామ్ హౌజ్‌లో పార్టీ జరిగింది. ఆ పార్టీలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రియా చక్రవర్తి పాల్గొని సెలబ్రేట్ చేసుకొన్నారు. బోటులో లేక్‌లోకి వెళ్లి విహార యాత్ర చేసే వారు. ఆ సమయంలోనే ఆల్కాహాల్, మారిజువానా లాంటి డ్రగ్స్ తీసుకొనే వారు అని బోటు వర్కర్ వెల్లడించారు. 

అదే రోజు సుశాంత్ అకౌంట్ నుంచి 40 వేల రూపాయలు విత్‌డ్రా చేశారనే ట్రాన్స్‌జాక్షన్‌ను బయటపెట్టడం కూడా ఈ వార్తకు ఆధారం చేకూరినట్లైంది. ఈ పార్టీలో అనేక మంది నటీనటులు పాల్గొన్నారనే విషయాన్ని ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి, దీపేశ్ సావంత్ వెల్లడించిన విషయం తెలిసిందే.

కెరీర్ విషయానికి వస్తే... హీరోయిన్ అమలాపాల్ తన కెరీర్‌లో చేసిన వైవిధ్యభరితమైన సినిమాల్లో ఒకటి ‘ఆడై’. లేడి ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ‘ఆడై’లో అమలాపాల్ ఛాలెంజింగ్‌ రోల్‌లో నటించారు. తెలుగులో ‘ఆమె’గా విడుదలైన ఈ చిత్రానికి రత్నకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది రిలీజైన ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.

ఇప్పుడు తాజాగా ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్. ఈ సినిమా హిందీ రీమేక్‌లో శ్రద్దా కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నారని సమాచారం. మరి ఒరిజినల్ వెర్షన్‌లో అమల చేసిన బోల్డ్ సీన్స్‌ను రీమేక్‌లో శ్రద్దా కపూర్ చేస్తారా.? అనే చూడాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.