ప్రభాస్‌ హీరోయిన్‌, బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి స్పందించింది. మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగమయ్యింది. బాలీవుడ్‌ తారలకు ఆదర్శంగా నిలిచింది. 

తెలంగాణ ప్రభుత్వం, ఎంసీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. మూడో విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం మరింత బాగా సాగుతుంది. ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రభాస్‌ మొక్కలు నాటి పచ్ఛదనాన్ని, పర్యవరణ పరిరక్షణలో భాగమయ్యారు. హరితహారంలో భాగమయ్యారు.

 అంతేకాదు ఆయన బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌కి ఈ ఛాలెంజ్‌ విసరగా తాజాగా ఆమె స్వీకరించింది. ప్రభాస్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీకరించిన శ్రద్ధా కపూర్‌ బుధవారం ముంబయిలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తాను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకుంది. తనని ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినందుకు ప్రభాస్‌కి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్‌ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. 

గతేడాది వచ్చిన `సాహో` చిత్రంలో ప్రభాస్‌కి జోడిగా శ్రద్ధా కపూర్‌ నటించిన విషయం తెలిసిందే. సుజిత్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది.