Asianet News TeluguAsianet News Telugu

షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ తో శర్వానంద్ ఫిల్మ్!?

సంవత్సరం క్రితం లండన్‌ చెందిన ప్రతిష్ఠాత్మక క్రిస్టల్‌ ప్యాలెస్‌లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ వేడుకల్లో తెలుగు లఘు చిత్రం చోటు దక్కించుకుంది. మన దేశం తరపున ఈ వేడుకల్లో చోటుదక్కించుకున్న తెలుగు లఘచిత్రం ‘మనసానమః’. 

Short Film director Deepak next with Sharwanand? jsp
Author
Hyderabad, First Published Jun 15, 2021, 10:02 PM IST

యూట్యూబ్ పుణ్యమా అని షార్ట్ ఫిల్మ్ లతో తమ ప్రతిభను నిరూపించుకుని సినిమాలు సంపాదించిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. దాంతో సినిమా పరిశ్రమలో ప్రవేశిద్దామనుకునేవాళ్లు ఈ ప్లాట్ ఫామ్ వినియోగించుకుని త‌మ‌కు న‌చ్చిన‌ట్టు, తోచిన రీతిలో ఎడా పెడా ల‌ఘు చిత్రాలు తీస్తున్నారు. ప్ర‌తి రోజు డ‌జన్ల కొద్దీ డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో అప్ లోడ్ చేస్తున్నారు. వాటిల్లో కొన్ని క్లిక్ అవుతున్నాయి. ఇంకొన్నింటికి వ్యూవ‌ర్స్ పెరుగుతున్నారు. అలాగే ఈ ఫిలిమ్ ల‌లో న‌టించిన వాళ్లు ప్ర‌స్తుతం న‌టుల‌య్యారు. వాళ్ల‌కు స్టార్ డ‌మ్ కూడా వ‌చ్చేసింది. డైరక్టర్స్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో షార్ట్ ఫిలిం దర్శకుడుకి సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

సంవత్సరం క్రితం లండన్‌ చెందిన ప్రతిష్ఠాత్మక క్రిస్టల్‌ ప్యాలెస్‌లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ వేడుకల్లో తెలుగు లఘు చిత్రం చోటు దక్కించుకుంది. మన దేశం తరపున ఈ వేడుకల్లో చోటుదక్కించుకున్న తెలుగు లఘచిత్రం ‘మనసానమః’. దీపక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  విరాజ్ అశ్విన్ - సూర్యగా,  ద్రిషికా చందర్ -  చైత్రగా, శ్రీవల్లి రాఘవేందర్ - వర్షగా, పృథ్వీ శర్మ - సీత పాత్రల్లో నటించారు. 

ఈ సినిమా కథేంటంటే ఒక యువకుడు తన జీవితంలో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. కాలాల్లో మూడు రకాలు ఉన్నట్లు అతను చలికాలంలో ఒకరిని, వర్షకాలంలో ఒకరిని, వేసవిలో ఒకరిని ఇలా ఆ యువకుడి జీవితంలో చోటుకున్న సంఘటనలే చిత్ర కథ.

అప్పట్లో ఈ షార్ట్ ఫిల్మ్ ని  పొగుడుతూ అప్పట్లో అనుష్క, రష్మిక లాంటి స్టార్ హీరోయిన్లు ట్వీట్లు కూడా పెట్టారు. దాదాపు డబ్బై కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న షార్ట్‌ ఫిల్మ్‌గా రికార్డుల్లోకెక్కింది.  గతంలో ఈ డైరెక్టర్ ‘డబ్ల్యూటీఎఫ్‌'(వాట్‌ ఈజ్‌ ది ఫ్యాక్ట్‌), ‘ఎక్స్‌క్యూజ్‌మీ’, ‘హైడెన్‌ సీక్‌’ లాంటి షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించారు.

అలాగే శేఖర్ కమ్ముల వద్ద ‘ఫిదా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పని చేశారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో  లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఓకే చెప్పబోతున్నారు.  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. రీసెంట్ గా ఈ బ్యానర్ లో నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది! 

Follow Us:
Download App:
  • android
  • ios