సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ నేటితో ముగిసింది. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ ఇక వరుస అప్డేట్స్ అందిస్తామన్నారు మేకర్స్. 

మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). ఈ చిత్రానికి పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. గత సినిమాలతో ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాను పండిచడంలో దిట్ట అని పరుశురామ్ నిరూపించుకున్నారు. మహేశ్ బాబు ఈ సినిమాలో ఎంత ఎనర్జిటిక్ గా, రొమాంటిక్ గా కనిపించబోతున్నాడనే ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ చూస్తే అర్థమైపోతోంది. మరోవైపు అభిమానులను, మాస్ ఆడియెన్స్ ను ఖుషీ చేసేందుకు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా తెరకెక్కించారంట పరుశురామ్.

ఇదిలా ఉంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కు ‘సర్కారు వారి పాట’ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్నామంటూ అప్డేట్ అందించారు. ఇంకా ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉందని, మిగితా షూటింగ్ పార్ట్ పూర్తి చేసినట్టు తెలిపారు. షూటింగ్ పూర్తి కావడంతో.. ఇకపై వరుస అప్డేట్స్ అందిస్తామన్నారు. ఇందుకు ఫ్యాన్స్, ఆడియెన్స్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ట్విటర్ వేదికన మేకర్స్ అధికారిక ప్రకటన వెలువరిచింది. అప్డేట్ అందిస్తూ మహేశ్ బాబు న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. చాలా సింపుల్ లుక్ లో మహేశ్ అదిరిపోయాడు. 

ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ కళావతి (Kalaavathi) ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘పెన్సీ’ సాంగ్ కూడా య్యూటూబ్ లో దూసుకెళ్తోంది. దర్శకుడు పరుశురామ్ మాత్రం ప్రతి ఫ్రేమ్ ను కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు సాంగ్స్, టీజర్ తో ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొంది.

Scroll to load tweet…

ఇక బ్యాకింగ్ రంగం నేథప్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతా గోవిందం మూవీ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. వచ్చే నెల ఈ రోజున (మే 12న) సర్కారు వారి పాట థియేటర్లలో సందడి చేయనుంది.