Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ న్యూస్: బిగ్ బాస్ విన్నర్, చిన్నారి పెళ్లికూతురు హీరో సిద్ధార్థ్ శుక్లా మృతి

40ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. ముంబైలో గల తన నివాసంలో గుండెపోటుకు గురైన సిద్ధార్థ్ శుక్లాను కుటుంబ సభ్యులు కూపర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే అప్పటికే సిద్దార్థ్ శుక్లా మరణించినట్లు సీనియర్ వైద్యులు ధృవీకరించారు. 

shocking news bigg boss title winner young actor sidharth shukla dies at 40
Author
Mumbai, First Published Sep 2, 2021, 12:18 PM IST

బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యంగ్ యాక్టర్ సిద్దార్థ్ శుక్లా అకాల మరణం పొందారు. 40ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.గురువారం ఉదయం ముంబైలో గల తన నివాసంలో గుండెపోటుకు గురైన సిద్ధార్థ్ శుక్లాను, కుటుంబ సభ్యులు కూపర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే అప్పటికే సిద్దార్థ్ శుక్లా మరణించినట్లు సీనియర్ వైద్యులు ధృవీకరించారు. ఎంతో భవిష్యత్తు కలిగిన సిద్దార్థ్ అకాల మరణం బాలీవుడ్ లో విషాదం నింపింది. సిద్దార్థ్ మృతికి సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


1980లో ముంబైలో జన్మించిన సిద్దార్థ్ శుక్లా విద్యాభ్యాసం అక్కడే సాగింది.  సిద్ధార్థ్ కెరీర్ బుల్లితెరపై ప్రారంభమైంది. 'బాబుల్ కా అన్గాన్ చోటే నా' షోలో లీడ్ రోల్ తో ఆయన కెరీర్ మొదలుపెట్టారు.  ఆ తరువాత జానే పెచానే సే ఏ అజ్నాబి, లవ్ యు జిందగీ వంటి షోల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన సీరియల్ బాలిక వధులో హీరో సిద్దార్థ్ చేశారు. ఈ సీరియల్ఈ తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా ప్రసారం కాగా, ఇక్కడ కూడా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఈ సీరియల్ ఆయనను చాలా పాప్యులర్ చేసింది. 


ఇక బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొని టైటిల్ విన్నర్ అయ్యారు. ఇక 2014లో కరణ్ జోహార్ నిర్మించిన హమ్టి శర్మకి దుల్హానియా చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేశారు. సిద్దార్థ్ శుక్లా తల్లితో పాటు ఇద్దరు సిస్టర్స్ తో కలిసి జీవిస్తున్నారు. గత ఏడాది సంభవించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మరువక ముందే మరో యంగ్ యాక్టర్ ఇలా మృత్యు ఒడికి చేరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios