రజనీకాంత్ సత్తాని బాక్సాఫీస్‌కి రుచిచూపించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం విడుదలై నేటితో 15ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు రజనీకాంత్, దర్శకుడు శంకర్.
ఇండియాలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా జోరు సాగుతుంది. హిట్ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం ఈజీ అయిపోయింది. కలెక్షన్ల లెక్కలు మారిపోయాయి. కానీ పదిహేనేళ్ల క్రితం వంద కోట్లు అంటే అదొక సంచలనం. అదొక రికార్డు. ఆ రికార్డ్ ని క్రియేట్ చేసిన చిత్రం `శివాజీ`(Shivaji). ఇండియన్ సినిమాలోనే వంద కోట్ల కలెక్షన్ల రుచిని చూపించిన చిత్రంగా `శివాజీ` నిలిచింది. 60కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.150కోట్లు వసూలు చేసి రజనీకాంత్(Rajinikanth) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా, ఇండియన్ సినిమాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, తొలి వంద కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.
సూపర్ స్టార్ రజనీ మార్క్ మేనియా, స్టయిల్, యాక్షన్ ఈ చిత్రాన్ని తిరుగులేని సక్సెస్ చేశాయి. అలాగే శంకర్ మార్క్ గ్రాండియర్ నెస్, కథ, టేకింగ్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. 2007 జూన్ 15న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది `శివాజీ`. రజనీకాంత్ సత్తాని బాక్సాఫీస్‌కి రుచిచూపించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం విడుదలై నేటితో 15ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు రజనీకాంత్, దర్శకుడు శంకర్(Shankar). వీరి కాంబినేషన్ శ్రియా కథానాయికగా, ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారీ చిత్రానికి.
`శివాజీ` సినిమా బుధవారంతో పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీని కలిశారు దర్శకుడు శంకర్. ఆయన నివాసానికి చేరుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటి షూటింగ్ రోజులను నెమరేసుకున్నారు. ఆ సక్సెస్‌ని గుర్తు చేసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, ఆ పిక్ వైరల్ అవుతుంది. రజనీ అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఈ సందర్భంగా మరో కొత్త రూమర్ ఊపందుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా? అనే ఊహగనాలు మొదలయ్యాయి.
`శివాజీ` చిత్రం తర్వాత రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో రెండు సినిమాలొచ్చాయి. `రోబో` ఇండియన్ సినిమాని షేక్ చేసింది. ఈ సినిమా కోసం రెండువందల కోట్లకిపైగా గ్రాస్‌ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఆ తర్వాత వచ్చిన `2.0` చిత్రం సైతం భారీ విజయాన్ని సాధించింది. వంద కోట్ల క్లబ్‌ని దాటింది. కానీ `రోబో` స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మరి ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందా? అనే చర్చ తెరపైకి వస్తుంది.
ప్రస్తుతం రజనీకాంత్... నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల నెల్సన్ `బీస్ట్` చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. మరోవైపు శంకర్.. రామ్‌చరణ్‌తో `ఆర్‌సీ15` చిత్రం చేస్తున్నారు. ఇది సుమారు యాభైశాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని టాక్. మరోవైపు కమల్ హాసన్‌తో చేయాల్సిన `ఇండియన్ 2` వాయిదా పడింది. మళ్లీ దాన్ని తెరకెక్కించేందుకు కమల్ ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు ఎన్టీఆర్.. శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ, శంకర్ సినిమాకి ఛాన్స్ ఉందా? అనేది సస్పెన్స్ నెలకొంది.అయితే ఇండస్ట్రీలో ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు.
