తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన నటుడు సచిన్‌ జోషి.. ఇటీవల బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాల మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో సచిన్‌ సత్య యుగ్ గోల్డ్‌ తనను చీట్ చేసిందని ఆ సంస్థ నిర్వాహకులు శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలపై ఫిర్యాదు చేశారు. కంపెనీలో ఓ స్కీమ్‌ కింద తాను కేజీ బంగారం కొనుగోలు చేసిన సమయంలో మోసం చేశారని ఆయన ఆరోపించాడు.

అయితే ఈ విషయంపై ఇంతకాలం మౌనంగా ఉన్న శిల్పాశెట్టి ఫైనల్‌గా స్పందించింది. సచిన్‌ జోషి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని ఆమె పేర్కోంది. సత్యయుగ్‌ గోల్డ్ ప్రతీ కస్టమర్‌ కు చేసిన ప్రామిస్‌ను పూర్తిచేసిందని, అందరికీ సరైన సమయానికి గోల్డ్ అందించిందని తెలిపింది శిల్పా. సచిన్‌ జోషికి కూడా అందరికీ ఇచ్చినట్టుగానే గోల్డ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కానీ ఆయన చెల్లించాల్సిన మొత్తం చెల్లిస్తే వెంటనే ఆయన బంగారం ఆయనకు ఇచ్చేస్తారని తెలిపింది.

ఆయనకు బంగారం ఇచ్చే ఉద్దేశం లేకపోతే మేం ఆ మొత్తాన్ని కోర్టులో ఉందుకు డిపాజిట్‌ చేస్తాం. ఈ విషయంపై శిల్పా,రాజ్‌కుంద్రాలకు సంబంధించిన లీగల్‌ టీం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ గైడ్‌లైన్స్‌లో బంగారు అనుకున్న సమయానికి కలెక్ట్ చేసుకోకపోతే స్టోరేజ్‌ ఛార్జెస్‌ చేయాలని పే చేయాలని స్పష్టంగా ఉందని తెలిపారు. ఈ విషయాలపై జోషి ఎప్పుడు కంపెనీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదని వారు వివరించారు.