కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమ అభిమానులను అలరించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంత మంది హాట్ బ్యూటీస్ గతంలో తీయించుకున్న హాట్ ఫోటో షూట్‌లను షేర్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం తమ వర్క్ అవుట్ వీడియోస్‌ను షేర్ చేస్తూ అభిమానులను ఇన్స్‌పైర్‌ చేస్తున్నారు. మరికొందరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరాదా వీడియోలను అభిమానులకు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియోను షేర్ చేసింది మాజీ హీరోయిన్‌ శిల్పా శెట్టి.

శిల్పాశెట్టి తన భర్త రాజకుంద్రా, కొడుకు వియాన్‌తో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. టిక్ టాక్ వీడియో శిల్పా డ్యుయల్‌ రోల్‌ లో కనిపించింది. ఒక క్యారెక్టర్‌ లో రాజ్‌కుంద్రా భార్యగా కనిపించగా, మరొ క్యారెక్టర్‌లో పనిమనిషిగా కనిపించింది. శిల్పా డ్రెస్‌ను సెలెక్ట్‌ చేస్తుండగా భర్త రాజ్‌ కుంద్రా శిల్పా శెట్టికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు. శిల్ప వద్దని చెపుతుంది.

అప్పుడే రెండో క్యారెక్టర్‌లో శిల్ప ఎంటర్‌ అవుతుంది. వచ్చి `పనిలో ఉన్నపు​డు ఎవరైనా ఇలా డిస్టర్బ్ చేస్తే చిరాకు వస్తుంది. అలా డిస్ట్రబ్ చేసి వాళ్లను కొట్టాలన్నంత కోపం వస్తుంది. వెంటనే రియాక్ట్ అయిన శిల్ప భర్తను చితక్కొడుతుంది. అంతేకాదు `నేను నా పని చూసుకుంటుంటే నా భర్త ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అందుకే చితక్కొట్టా. అయినా నేను నా భర్తనే గా కొట్టింంది అంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.