Asianet News TeluguAsianet News Telugu

రాజ్‌కుంద్రా అరెస్ట్ వెనకాల షెర్లిన్‌ చోప్రా, పూనమ్‌ పాండే..?

రాజ్‌కుంద్రా అరెస్ట్ వెనకాల బాలీవుడ్‌ శృంగార తారలు షెర్లిన్‌ చోప్రా, పూనమ్‌ పాండే ఉన్నట్టు తెలుస్తుంది. వారు ఇచ్చిన కంప్లయింట్ తోనే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడని బాలీవుడ్‌ సమాచారం. 

sherlyn chopra, poonam panday main reason for raj kundra arrest? what happen beyond ? arj
Author
Hyderabad, First Published Jul 20, 2021, 1:26 PM IST

రాజ్‌కుంద్రా నీలిచిత్రాల రాకెట్‌(పోర్న్ మూవీస్‌) ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. రాజ్‌కుంద్రా అరెస్ట్ కి కారణం హిందీ శృంగార తార షెర్లిన్‌ చోప్రా అని తెలుస్తుంది. ఆమె కారణంగానే రాజ్‌కుంద్రాని అదుపులోకి తీసుకున్నారట. నిజానికి ఫిబ్రవరిలోనే రాజ్‌కుంద్రాపై ఈ నీలిచిత్రాల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ కుంద్రా జూన్‌లో ముంబయి సెషన్స్ కోర్ట్ ని ఆశ్రయించారు. ఇప్పుడు పక్కా ఆధారాలు సేకరించి రాజ్‌కుంద్రాని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

అయితే రాజ్‌కుంద్రా అరెస్ట్ వెనకాల బాలీవుడ్‌ శృంగార తార షెర్లిన్‌ చోప్రా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె ఇచ్చిన కంప్లయింట్ తోనే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడు. తనను పోర్న్ మూవీస్ చేయాలని రాజ్ కుంద్రా బలవంత పెట్టేవాడని ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు, వెబ్‌ సిరీస్‌ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై కుంద్రాకి సంబంధించిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఉద్యోగిని క్రైమ్‌ బ్రాండ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఉద్యోగికి ఏప్రిల్‌లో బెయిల్ మంజూరైంది. 

ఈ కేసులో రాజ్ కుంద్రాకు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లపై స్పందించిన శిల్పాశెట్టి భర్త ఆ స్టార్టప్ నుంచి తాను అప్పటికే వైదొగిలిగానని, ఆ కంపెనీకి తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మరో శృంగార తార పూనమ్‌ పాండే సైతం గతేడాది రాజ్‌కుంద్రాపై కేసు పెట్టింది. ఆమె తన వీడియోలను తన అనుమతి లేకుండా రాజ్‌కుంద్రా వాడుకుంటున్నారని, వాటిని మిస్‌యూజ్‌ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు కూడా ఇప్పుడు రాజ్‌కుంద్రా మెడకి చుట్టుకుందని బాలీవుడ్‌ సమాచారం. 

అయితే గతంలో మహిళలను కించపరిచేలా పలు వివాదాస్పద ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచాడు రాజ్. అంతటితో ఆగకుండా సీతాదేవి ఉద్దేశించి కూడా ట్వీట్ చేశాడు. ఇవే కాదు గతంలోనూ రాజ్ కుంద్రా పై పలు ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ ఫిక్సింగ్ లోను రాజ్ కుంద్రా హస్తం ఉందని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే 2018లో బిట్ కాయిన్  కుంబకోణాలోనూ రాజ్ కుంద్రా పై ఆరోపణలు వచ్చాయి. దాంతో అప్పట్లో ఈడీ ఆయనను విచారించింది. ఇప్పుడు అన్నింటికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో అదుపులోకి తీసుకున్నట్టు హిందీ మీడియా సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios