ఉన్నత చదువులు చదివినా.. మట్టి వాసన మరిచిపోలేదు. తండ్రులు అప్పగించిన బిజినెస్ లను పిల్లలు వృద్ధి చేసినట్టు.. అతను తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన వ్యవసాయాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని తలచారు. అదికూడా తక్కువ పెట్టుబడితో! ఫలితంగా తన సాగు క్షేత్రాన్ని పరిశోధన కేంద్రంగా మార్చారు. కొత్త తరహా వ్యవసాయానికి రూపకర్తగా నిలిచారు. తాను చదివింది సాప్ట్ వేర్ కోర్స్ అయినా.. వందలమందికి ఉపాధి కల్పించి.. వేలమంది రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు కృషిచేస్తున్నారు! ఇదీ సినిమా కథ అంటే నమ్ముతారా..కానీ నిజం చేసి చూపించాడో దర్శకుడు. అదే శ్రీకారం. రైతు, వ్యవసాయ నేపథ్యం సినిమా కథతో శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు కిషోర్ రూపొందించిన చిత్రం ‘శ్రీకారం’. ట్రైలర్, టీజర్ చూస్తే ఒక మంచి ప్రయత్నంలా కనిపించిన ‘శ్రీకారం’ఎలా ఉంది, కథేంటి.  ప్రేక్షకుల అంచనాలను సినిమా ఏమేర అందుకుందో చూద్దాం.
 

కథేంటి

నీటి సమస్య అనంతపురాన్ని చాలా కాలంగా వేధిస్తోంది. అక్కడ రైతులు చాలా మంది అప్పులు పాలై,భూములు అమ్ముకుంటున్నారు. అక్కడే పుట్టి పెరిగి, ఆ కష్టాలు దాటి సిటీ కు వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజినీరు గా సెటిలయ్యాడు కార్తీక్ (శర్వానంద్). అతని తండ్రి కేశవులు (రావు రమేష్)తమ పల్లెలో రైతు. తనంటే ఆ బాధల నుంచి బయిటపడి,అప్పులు తీర్చుకున్నాడు. కానీ మిగతా వారి పరిస్దితి. తన చిన్నప్పటినుంచీ చూస్తున్న రైతులు దీన గాధలు అతనికి గుర్తు వస్తూనే ఉంటాయి. దాంతో లక్షల శాలరీ వచ్చే ఉద్యోగం వదిలి తన ఊరు వస్తాడు. ఎవరు వద్దన్నా తన ప్రయత్నం మొదలెడతాడు. వ్యవసాయం చేస్తూంటాడు. ఉమ్మడి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాడు. రైతులు ఎవరూ ఉత్సాహంగా ముందుకు రాకపోవటంతో వాళ్లకు జీతాలు ఇస్తాడు. ఈ క్రమంలో ఎన్నో సమస్యలు, సమర్దింపులు. చివరకు అతను అనుకున్న సానుకూల ఫలితాన్ని చూసాడా. ఉమ్మడి వ్యవసాయం లాభసాటేనా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
   
ఎనాలసిస్ ...

ఉన్నత చదువులు చదివినా.. తనను అంత చదువు చదివించిన మట్టి వాసన మరచిపోకూడదని చెప్పటమే ఈ సినిమా లక్ష్యం. అది అద్బుతమైనదే. కాకపోతే ఇప్పుడు రైతు అంటే బయిట కూడా పెళ్లి కావటం లేదు. అంత దారుణమైన పరిస్దితులు ఉన్నాయి. అలాంటిది.... ఆ మట్టినుంచి బంగారాన్ని సృష్టించి.. వందలాది రైతు కుటుంబాలను కష్టాల నుంచి బయటకు తీసుకొనిరావాలనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఓ రకంగా రైతుకు ధైర్యాన్ని ఇచ్చేదే. అయితే రైతులు ఎంత మంది ఈ సినిమాకు వెళ్తున్నారనేదే సమస్య.ఇక ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు మహర్షి ని గుర్తు చేయటం మరో విశేషం. రెండు సినిమాలు స్టోరీ లైన్ స్దాయిలో ఒకే రకంగా దాదాపు ఉంటాయి. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ వేరు.   రైతు సమస్యలు. అటు తండ్రీ కొడుకుల కాన్ ఫ్లిక్ట్ ని బాలెన్స్ చేస్తూ కథ నడిపాడు. 

కానీ చిత్రం ఏమిటంటే శతమానం భవతి సినిమాలో శర్వాలా పాత్ర ఉన్నట్లుంది మారిపోయింది. డైరక్టర్ వ్యవసాయం నేపధ్యంలో ఎమోషనల్ సీన్లు రాసుకున్నాడు. కొత్త దర్శకుడు కిషోర్ కు మాటల రచయిత సాయిమాధవ్ బాగా సాయం చేసారు.  అలాగే ఈ సినిమా ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బాగుంది. ఇలాంటి కథల్లో సాధారణంగా చోటు చేసుకునే...హెవీగా ఉండే భారమైన సీన్స్ కూడా పెద్దగా పెట్టి పిండే ప్రయత్నం చేయకపోవటం రిలీఫ్. క్లైమాక్స్ కూడా కొత్తగా ఉంది. ఓ చిన్న డైలాగుతో సినిమాని లేపే ప్రయత్నం చేసాడు. 

అయితే  యూత్ కు అవసరమైన ఎంటర్టైన్మెంట్, హీరోయిన్ ట్రాక్ పెద్దగా కలిసి రాలేదు. మరి ఆ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం, టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని  లాభసాటిగా మలిచటం వంటివి  చాలా రీసెర్చ్ చేసి తెరకెక్కించారనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు కష్టం కనిపిస్తుంది.

టెక్నికల్ గా 
కొత్త దర్శకుడు అయినా ఎక్కడా తడబాటు లేకుండా తెరకెక్కించటం బాగుంది. అతనికి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైలాగులు అందించిన టీమ్ బాగా కలిసొచ్చింది. బ్కక్ గ్రౌండ్ స్కోర్, రెండు పాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండచ్చు. 

నటీనటుల్లో ..శర్వా ఎప్పటిలాగే సెటిల్డ్ ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. రావు రమేష్ కూడా అంతే. హీరోయిన్ పెద్దగా కలిసి రాలేదు. 
 నరేశ్‌, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.ఆమని, రావు రమేష్,సాయి కుమార్ తమదైన శైలిలో గుర్తుండిపోయేలా చేసారు. 

ఫైనల్ థాట్
 
ఇంజినీరింగ్‌ వదిలేసి.. సేద్యం వైపు వచ్చిన నిజ జీవిత వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్లందరిని ఈ సినిమా ఓ సారి గుర్తు చేసినట్లు అయ్యింది. ప్రేరణ పొందేందుకు అవకాసం ఇచ్చింది.
 
రేటింగ్: 2.5/5
--సూర్య ప్రకాష్ జోశ్యుల

కాస్ట్ : శర్వానంద్,ప్రియాంక మోహన్,రావు రమేష్,ఆమని,సీనియర్ నరేష్,సాయి కుమార్, మురళి శర్మ, సత్య,సప్తగిరి తదితరులు.
డైరెక్టర్ : కిషోర్ రెడ్డి
మ్యూజిక్ :మిక్కీ జె మేయర్
డి. ఓ.పి : జె. యువరాజ్
డైలాగ్స్ : సాయి మాధవ్‌ బుర్రా
ఆర్ట్ : అవినాష్ కొల్ల
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడ్యూసర్స్ : రామ్ ఆచంట,గోపి ఆచంట