బ్ర‌హ్మోత్స‌వం డిజాస్టర్ తో శ్రీకాంత్ అడ్డాల గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కుంటున్నాడు. అప్ప‌టి వ‌ర‌కూ ఇచ్చిన హిట్లు ఎవరికీ గుర్తు లేదు. నిర్మాత‌లెవ‌రు అవ‌కాశాలు ఇవ్వ‌డానికి ముందుకు రాలేదు. అయితే లక్కీగా ...తమిళంలో సూపర్ హిట్టైన అసురన్ కు డైరక్టర్ గా శ్రీకాంత్ ని సురేష్ బాబు ఎంపిక చేసి ఆదుకున్నారు. వెంకటేష్ హీరోగా ఆ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగింది లేకపోతే ఈ పాటికి రిలీజ్ కు రెడీ అయ్యేది. ఈ నేపధ్యంలో ఆయన ఈ లాక్ డౌన్ టైమ్ లో తన దగ్గర రెడీగా ఉన్న స్క్రిప్టు కూచిపూడివారి వీధిలో  కు పదును పెడుతూ హీరోలను వెతుకుతున్నట్లు సమాచారం. హీరో దొరికితే గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తామని హామీ ఇచ్చారట.  ఈ క్రమంలో అంతకు ముందు స్క్రిప్టు ఓకే చేసిన శర్వానంద్ ఏమయ్యారు ..ఆయన చెయ్యటం లేదా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. 

అందుతున్న సమాచారం మేరకు జానూ ప్లాఫ్ అయ్యాక శర్వానంద్ రిస్క్ తీసుకునే పరిస్దితుల్లో లేనని శ్రీకాంత్ అడ్డాలకు నో చెప్పేసారట. తను కెరీర్ పరంగా వెనక బడ్డానని, శ్రీకాంత్ అడ్డాల పరిస్దితి కూడా బాగోలేదు కాబట్టి బిజినెస్ విషయంలో ఇబ్బందులు వస్తాయని కాబట్టి వేరే హీరోతో ప్రొసీడ్ అయ్యిపొమ్మని చెప్పారట. దాంతో శ్రీకాంత్ అడ్డాల..ఇప్పుడు స్క్రిప్టు ని తిరగ రాసి..వేరే హీరోలకు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాని ఈ సినిమాకు నో చెప్పేసారు. 

అలాగే రామ్ పొతినేని కూడా ఈ స్క్రిప్టుని  వినిపించాడుట‌. కానీ అక్క‌డ నుంచి ఎలాంటి పాటిజివ్ రిప్లై రాలేద‌ని స‌మాచారం. దీంతో వేరే యంగ్  హీరోని వెతికే ప‌నిలో త‌ల‌మున‌క‌లై ఉన్న‌ట్లు తెలిసింది. గ‌తంలో త‌న‌తో సినిమాలు చేసిన హీరోలంద‌ర్ని ట‌చ్ లోకి వెళ్తున్నారట. అయితే ఎవరికి వాళ్లు ఇప్పుడు కాదు,బిజీ  అంటూ చేసినా ఎస్కేప్ అవుతున్నారుట‌. తెలుగు సినిమాకు మ‌ల్టీస్టార‌ర్ ప‌రిచయం చేసిన ద‌ర్శ‌కుడికి ఇప్పుడు అవ‌కాశాలు రాకపోవ‌డం చాలా మందికి బాధ కలిగించే విషయం.