‘జాను’ అక్కడ పెద్ద హిట్, దిల్ రాజు ఫుల్ హ్యాపీ

 శర్వానంద్, సమంత మొదటిసారిగా జంటగా నటించిన సినిమా జాను. మొన్న ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘జాను’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.రివ్యూలన్నీ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అన్నాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు తగినట్లు లేకపోవటం ..షేర్ బాగా తక్కువ రావటం చివరకు డిజాస్టర్ సినిమాగా తేలింది. ఈ సినిమా రిజల్ట్ తో దిల్ రాజు పూర్తిగా నిరాశపడ్డారు. తమిళ ఒరిజనల్ “96”  తమిళంలో పెద్ద హిట్ అవటంతో ఇక్కడ ఆ స్దాయి ప్లాఫ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. 

 ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఈ సినిమా దుమ్ము దులుపుతుంది అనుకుంటే అక్కడ కూడా కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. సమంతకు మొదట నుంచీ ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ ఉన్నా అది భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. ఈ నోస్టాలిజీ రొమాంటిక్ డ్రామా...స్మాల్ స్క్రీన్ పై మాత్రం వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఏప్రియల్ 12న స్టార్ మా లో వచ్చిన ఈ చిత్రం 7.59 టీఆర్పీ పాయింట్స్ తెచ్చుకుంది. ఓ ప్రక్కన ఈటీవి న్యూస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఎంటర్టైన్మెంట్ సైడ్ జాను బాగా వర్కవుట్ అయ్యింది. ఈ వార్త విన్న దిల్ రాజు కాస్త రిలీఫ్ అయ్యారు. తన అంచనా తప్పలేదని ఆనందపడ్డారు. 

 ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ పడ్డాయి. సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. వారి వారి తొలి ప్రేమ జ్జాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.  జాను సినిమాను దిల్‌రాజు నిర్మించగా.. తమిళ దర్శకుడు ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు.