దాదాపు పాతికేళ్ల క్రితం వరకు కూడా ఆ పేరు చెబితే చాలు.. కుర్రాళ్లు ఉర్రూతలూగిపోయేవారు. పోస్టర్ మీద ఆ పేరుంటే చాలు.. సినిమా థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. ఆమే.. ప్రముఖ హాలీవుడ్ నటి, నిర్మాత షరాన్ స్టోన్. ఆమె ఓ వెర్శటైల్ సెక్స్ సింబల్ గా పేరు తెచ్చుకుంది. 1992లో చేసిన బేసిక్ ఇనిస్టెంట్ సినిమా గురించి అయితే చెప్పక్కర్లేదు.  అప్పటి ఆమె ప్రయాణం..ప్రస్తుతం నెట్ ప్లిక్స్ లో వస్తున్న  Ratched సీరిస్ దాకా సాగుతోంది.

ఈ 62 ఏళ్ల మాజీ హీరోయిన్ ...తన జీవితాన్ని తనకు నచ్చినట్లు గడుపుతూ ఆనందంగా ఉంది. మ్యాగజైన్స్ కు ఇంటర్వూలు ఇస్తోంది. తాజాగా  ఆమె..టౌన్ అండ్ కంట్రీ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వూలో తన బేసిక్ ఇనిస్టెంట్ సినిమానాటి అనుభవాలను గుర్తు చేసుకుంది.  

అప్పట్లో తానూ లైంగిక వేధింపులకు గురి అయ్యాయని అంది. అయితే అప్పటి సంఘటన గురించి పెద్దగా వివరాలు ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఆ సీన్ దిశా నిర్దేశం కోసం తన ఒళ్లో కూర్చోవాలని డైరక్టర్ కోరాడు,తాను ఒప్పుకోలేదు,దాంతో తను మళ్లీ మళ్లీ అదే సీన్  చేయాల్సి వచ్చిందని అని స్టోన్ చెప్పింది. అలాంటి సంఘటనలు తన జీవితంలోనూ తను కెరీర్ లో పీక్స్ లో ఉన్నప్పుడు జరగటం మరీ విశేషం అన్నారు.

అలాగే ఈ వయస్సులోనూ జనం నా వక్షోజాలు చూడటానికి ఇష్టపడటం తనకు ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. తను అప్పట్లో అంతలా క్లిక్ అవటానికి కారణం ...ఆ సమయంలో అసలైన సెక్స్ సింబల్ జనాలకి అవసరమై ఉంటుంది అన్నారామె మొహమాటం లేకుండా.
 
అయితే నిజానికి నేను వాళ్లు కోరుకున్నంత సెక్సీగా ఉన్నాను అనుకోను. బేసిక్ ఇనిస్టింక్స్ సినిమా చేసేటప్పుడు నాలో ఉన్న డార్క్ సైడ్ ని నేను ఎక్సప్లోర్ చేసా. ఆ డార్క్ సైడ్ తో ప్రెడ్షిప్ చేసా. నా డార్క్ సైడ్ చూసి నేను భయలేదు. జనాలు దాన్నే సెక్సీ అనుకున్నారు. 
 
ఇక ఆడాళ్లు సర్వసాధారణంగా అబద్ధాలు ఎక్కువగా చెప్పేది, వీలైనంతవరకు దాచాలని అనుకునేది కూడా వాళ్ల వయసు గురించే. కానీ, షరాన్ స్టోన్ మాత్రం తన వయసు విషయంలో ఏ ఒక్కరోజూ అబద్ధాలు చెప్పనే లేదట. వయసు పెరుగుతోందంటే మనం కూడా ఎదుగుతున్నట్లేనని, అందువల్ల దాని గురించి భయపడటం సరికాదని ఆమె చెప్పింది.