షకీలా అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ముఖ్యంగా కాసింత ఆ తరహా సబ్జెక్టును కోరుకునే ఆడియన్స్ అయితే.. అప్పట్లో షకీలా గురించి తెగ కలలు కనేసేవారు. ఒకానొక సమయంలో మలయాళ ఫిలిం ఇండస్ట్రీ స్టార్లు ఈమె దెబ్బకు జడిసి.. బ్యాన్ విధించేశారు. ఆ తర్వాత టాలీవుడ్ వచ్చి.. ఇక్కడ కామెడీ పాత్రలను చేసి మెప్పించిన ఈమె.. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రీసెంట్ గా షకీలా నటించిన శీలవతి అనే సినిమా కబుర్లు వినిపిస్తుండగా.. పోర్న్ అనే పదం గురించి జనాలు డిస్కషన్స్ వచ్చేలా చేశాడు రాంగోపాల్ వర్మ. జీఎస్టీ వచ్చింది.అంతవరకూ బాగానే ఉన్నా.. జీఎస్టీ2 కనుక తీస్తే తానే ఆ సినిమాలో నటిస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది షకీలా. నిజంగా చెప్పిందో.. లేక శీలవతికి ఫ్రీ పబ్లిసిటీ దక్కడం కోసం చెబుతోందో కానీ.. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తోంది.

'ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా సరే.. ఎవరికైనా సరే.. ఆడ అయినా మగ అయినా ట్రాన్స్ జెండర్ అయినా సెక్స్ ఒక శారీరక అవసరం. పోర్న్ లో పెద్దగా తప్పేమీ లేదు. సినిమాల్లో ఉందని అంటారు కానీ.. ఎక్కడైనా ఇది ఉంటుంది. సినిమాల్లో ఉండేది నటన మాత్రమే. సినిమా కోసం నేను మా పెదనాన్న గారి కొడుకు.. నాకు అన్న వరుస అయే వ్యక్తితోనే ఆ సీన్లలో నటించాను. అది నటన మాత్రమే. అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు' అంటోంది షకీలా.