Asianet News TeluguAsianet News Telugu

మహిళా సంఘాలకు ఏం పనిలేదు,సెక్స్ అందరికీ కావాల్సిందే-షకీలా

  • నైంటీస్ లో శృంగార తార అంటే షకీలానే..
  • చాలా గ్యాప్ తర్వాత శీలవతి అనే చిత్రంతో వస్తోన్న షకీలా
  • వర్మ జీఎస్టీకి మద్దతిస్తూ మహిళా సంఘాలవాళ్లకు పనిలేదంటూ షకీలా కామెంట్స్
SHAKEELA COMMENTS ON SEX AND WOMEN ACTIVISTS

నైంటీస్ లో కుర్రకారును తన శృంగార చిత్రాలతో ఉర్రూతలూగించిన షకీలా అనగానే గుర్తొచ్చేది శృంగార చిత్రాలే. అప్పట్లో శృంగార దేవతగా నీరాజనాలు అందుకున్న ఆమె ఓ సంచలనం. ఆ తర్వాత బి గ్రేడ్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి తిరిగి మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో కేరక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. చాలా కాలం గ్యాప్ తర్వాత షకీలా తిరిగి 'శీలవతి' అనే టైటిల్ తో మళ్లీ రసభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా శీలవతి మూవీకి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో మహిళా సంఘాల ఆందోళనలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

 

మహిళలను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారని నేను భావించడం లేదు. మహిళలకు ఉండే మర్యాద ఎప్పుడూ ఉంది. మనం మన లిమిట్స్‌ లో ఉన్నంతసేపు ఏ సమస్యా ఉండదు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే ఎవరికీ సమస్య ఉండదు. అని షకీలా అభిప్రాయ పడ్డారు. నేను సాఫ్ట్ పోర్న్ మూవీ ఆర్టిస్టుగా ఉన్నప్పటికీ దర్శకుడు తేజగారి దగ్గర నుండి చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు మర్యాదగానే చూశారు. ఎప్పుడూ నన్ను తక్కువ చేసి చూడలేదు. అని షకీలా తెలిపారు. రాత్రి పూట లేడీస్ బయటకు వెళ్లకూడదు. మగ పిల్లలు తాగుతారు, తిరుగుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు, మనల్ని ఏం చేస్తారు అని 12 గంటలకు బయట తిరిగితే కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని షకీలా తెలిపారు.

 

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ గురించి మహిళా సంఘాలు చేస్తున్న ఆందోళనపై స్పందిస్తూ.. మహిళా సంఘాలకు ఇలాంటి పనులు తప్ప వేరే పని ఏమీ ఉండదు. నా సినిమాల సమయంలో కూడా ఇలానే సమస్య క్రియేట్ చేశారు. గ్లామర్ లేకుండా ఎక్కడ ఉంది? ఐటీ ఆఫీసులు, కాలేజ్ స్టూడెంట్స్ మాకంటే సెక్సీగా డ్రెస్ చేసుకుంటున్నారు. మేమన్నా ఫర్వాలేదు చూడీదార్ వేసుకుంటున్నాం. వాళ్లు జీన్స్, టాప్స్ అని వేరే లెవల్లో ఉన్నారు. అవన్నీ అడగొచ్చుకదా. మూవీస్ అనేవి ఒక ఎంటర్టెన్మెంట్. దీనిపై ఆందోళన చేయడం సరికాదు. ఇష్టం ఉంటే వెళ్లి చూడండి, లేకుంటే మీవాళ్లను కూడా చూడకుండా ఆపండి. అంతే తప్ప రిలీజ్ చేయకూడదు అని ఆందోళన చేయడం టూమచ్.అన్నారు.

 

రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ పార్ట్ 2 చేస్తానంటే... తప్పకుండా ఒప్పుకుంటాను. ఆయన లాంటి పెద్ద డైరెక్టర్ అడిగితే చేయకుండా ఎలా ఉంటాను. అయితే ఆయన సన్నగా కావాలని అడుగుతాడు. 30 కిలోల బరువు తగ్గాలంటే నాకు 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నా వల్ల కాదు కదా అని షకీలా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios