షకీలా రీసెంట్ గా నటించిన చిత్రం కొబ్బరి మట్ట. షకీలా తెలుగులో జయం, బంగారం, దొంగోడు లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల షకీలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి కామెంట్ చేసింది. ఈతరం హీరోల్లో తనకు ప్రభాస్, సూర్య అంటే చాలా ఇష్టం అని షకీలా తెలిపింది. 

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కంటే ప్రభాస్ చాలా హాట్ గా ఉంటదంటూ రొమాంటిక్ కామెంట్స్ చేసింది. సూర్యని గతంలో కలిశా. కానీ ప్రభాస్ ని కలుసుకునే అవకాశం ఇంకా రాలేదని తెలిపింది. 

మోహన్ లాల్ తన ఆల్ టైం ఫేవరేట్ హీరో అని షకీలా తెలిపింది. కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు తనకెప్పుడూ ఎదురుకాలేదని షకీలా తెలిపింది. తమిళం, మలయాళీ చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించిన షకీలా అడల్ట్ చిత్రాలలో నటించింది. ఆ చిత్రమే ఆమెకు గుర్తింపుతోపాటు విమర్శలు సైతం వచ్చేలా చేశాయి.