Asianet News TeluguAsianet News Telugu

షకీలని చెంపమీద కొట్టిన సిల్క్ స్మిత.. శృంగార తార తెరవెనుక జీవితం(షకీలా ట్రైలర్‌)

 షకీలా పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటిస్తుంది. పంకజ్‌ త్రిపాఠి, ఎస్తర్‌, శివా రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిల్క్ స్మిత పాత్రలో శివా రాణా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 

shakeela biopic trailer released arj
Author
Hyderabad, First Published Dec 26, 2020, 1:37 PM IST

దక్షిణాదిలో శృంగార తారగా వెలిగిన నటి షకీలా. సిల్క్ స్మిత తర్వాత ఆ రేంజ్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో రెండు వందలకుపైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఒకానొక దశలో స్టార్‌ హీరోలకు దీటుగా రాణించడంతోపాటు ఆమె సినిమాలు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. షకీలా పెద్ద పెద్ద హీరోలనే తన సినిమాలతో బయటపడేలా చేసింది. 

అంతగా ఓ వెలుగు వెలిగిన సెక్సీ బ్యూటీ షకీలా జీవితం ఆధారంగా ఇంద్రజిత్‌ లంకేష్‌ `షకీలా` పేరుతో ఓ బయోపిక్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో షకీలా పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటిస్తుంది. పంకజ్‌ త్రిపాఠి, ఎస్తర్‌, శివా రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిల్క్ స్మిత పాత్రలో శివా రాణా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో షకీలా వెలిగిన తీరు, ఆమె సినిమాలకు ఉన్న ఆదరణ, కొన్నాళ్లకి షకీలా సినిమాలంటే చెప్పులు విసిరేస్తారని, అలాగే తెరవెనుక షకీలా జీవితం ఎలా ఉండేదనే అంశాలను ప్రధానంగా చేసుకుని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. 

ట్రైలర్‌లో ఓ టీచర్‌ `ద్రౌపతి కారణంగానే మహాభారతం పుట్టింది. మీకు తెలుసా మహాభారతంలో అందరికంటే కష్టమైన పాత్ర అని అడగడం, దానికి షకీలా పాత్ర దారి నాకు చినప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. డైలాగ్‌లు చెప్పడం, డాన్స్ చేయడం వంటని చెప్పడం, పంకజ్‌ త్రిపాఠికి రిచా సర్‌ మీకు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పగానే ఆమెకి సినిమా అవకాశాలు రావడం, అతి తక్కువ టైమ్‌లోనే ఆమె పెద్ద స్టార్‌గా ఎదగడం, పంకజ్‌ త్రిపాఠినే కుళ్లుకోవడం జరిగిపోతుంటాయి. 

`సర్‌ షకీలా నటించిన సినిమాలు సిల్వర్‌ జూబ్లీ సెలబ్రేషన్‌ చేసుకుంటున్నాయి. అందరు షకీలాని జూనియర్‌ సిల్క్ అంటున్నారు..` అని అసిస్టెంట్లు అనగా, సిల్క్ స్మిత పాత్ర దారి శివారాణా `సిల్క్ అనుకుంటున్నావా సిల్క్.. ` అంటూ కొట్టడం, షకీలా సినిమాలు యూత్‌పై ప్రభావాన్ని చూపిస్తున్నాయని, అందుకు షకీలా స్పందిస్తూ, `నేను ఏది చేసినా బహిరంగంగానే చేశా.. తెరవెనుక చేయలేదు.. తన శరీరాన్ని గుర్తింపుగా చూసుకోవాలనుకోవడం లేదు` అనడం, చివరగా తెరవెనుక షకీలాని చూపిద్దామనడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఈ సినిమాతో షకీలా జీవితంలోని ఎత్తుపల్లాలను, తెరవెనుక కథని చూపించబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ సినిమాని జనవరి ఫస్ట్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో విడుదల చేయనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios