సౌత్ ఇండియాలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన షకీలా జీవితంపై ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళం ఇండస్ట్రీని షేక్ చేసిన షకీలా జీవితం వెనుక ఎన్నో సంఘటనలను తెరపై చూపిస్తారట. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ ఈ సినిమాను తెలుగు మలయాళంతో పాటు హిందీ లో కూడా తెరకెక్కించాడు. 

ఇక షకీలా పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా నటించింది. నేడు చిత్ర యూనిట్ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ రిచా గోల్డ్ ధరించి డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చింది. ఇక నాట్ ఏ పార్న్ స్టార్ అనేది సినిమాకు ట్యాగ్ లైన్. 1980 - 90 కాలంలో షకీలా అడల్ట్ మూవీస్ లో నటించి అప్పటి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా కలెక్షన్స్ ను రాబట్టేది. 

స్టార్ హీరోలు షకీలా సినిమాలకు బయపడి రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినిమాలో షకీలా జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ఇతర విషయాలని బహిర్గతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక షకీలా కూడా తన బయోపిక్ లో నటించింది. 2019 సమ్మర్ కి సినిమాను రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.