షారూఖ్ కెరీర్ పరిస్దితి గత కొంతకాలంగా అసలేమీ బాగోలేదు. వరసగా తన సినిమాలు డిజాస్టర్ అవటంతో ఏ కథను ఎంచుకోవాలి, ఏ హీరోయిన్ ని ,డైరక్టర్ ని సీన్ లోకి తెచ్చి ఒడ్డున పడాలో తెలియని సిట్యువేషన్. దానికి తోడు భారీ ఎక్సపెక్టేషన్స్ నడుమ రిలీజ్ చేసిన జీరో సినిమా కూడా డిజాస్టర్ అవటంతో కింగ్ ఖాన్ ఆలోచనలో పడ్డారు. దాంతో అసలు సమస్య ఎక్కడుందా.? అని చెప్పి ఐడింటిఫై చేసి,వర్కవుట్ చేద్దామనుకున్నాడు. త్వరలో ఓ ప్రకటన చేస్తానన్నాడు.

రాకేష్ శర్మ బయోపిక్ చేయటానికి కూడా ఉత్సాహం చూపించలేదు. సంజయ్ దత్ కు మున్నాభాయ్ లగేరహో వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజ్ కుమార్ హిరాణీ వంటి దర్శకుడు ని పట్టుకుని ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఈలోగా కరోనా దెబ్బ కొట్టేసింది. అంతేకాకుండా రాజకుమార్ హిరానీ కూడా షారూఖ్ కు ఓ కండిషన్ పెట్టారట.

సాధారణంగా షారుక్ ఖాన్ తో డైరక్టర్స్ కు ఓ సమస్య  ఎదురౌతోంది. అది తనకు ఎదురుకాకూడదని రాజ్ కుమార్ హిరానీ భావిస్తున్నారు.అదేమింటే..షారూఖ్ సినిమా ఉత్సాహంగా మొదలెడతారు. కానీ రెగ్యులర్ షూటింగ్ లకు డుమ్మా కొడతారు. కాల్ షీట్స్ ఎడ్జెస్ట్ చేస్తూంటారు. హడావిడిగా షూట్ కు వస్తూంటారు. అందుకు కారణం...వరస పెట్టి చేసే టీవి షోలు, ఈవెంట్ లు, డాన్స్ వీడియోలు, యాడ్స్, ఐపీఎల్ ఇలా చాలా తన భుజాన పెట్టుకుని సమయం మొత్తం దానికే కేటాయిస్తారు. ఇవన్నీ ప్రక్కన పెట్టి  సినిమాలకు 100 శాతం న్యాయం చేస్తానంటానే చేద్దామని చెప్పటంతో...ఈ సంవత్సరం వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారట షారూఖ్.   

దాంతో అసలు ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టు మొదలెట్టకూడదని ఫిక్స్ అయ్యాడట. 2021 ప్రారంభంలో సినిమా మొదలెట్టి,రెగ్యులర్ షెడ్యూల్ తో ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ లో న్యూస్ లు వస్తున్నాయి. ఇవి షారూఖ్ అభిమానులను కలవరపెడుతున్నాయి. జీరో సినిమా 2018లో రిలీజ్ అయ్యింది. నెక్ట్స్ సినిమా 2021 అంటే...మూడేళ్ల గ్యాప్. రెడ్ ఛిల్లీస్ ఎంటర్ట్నైమెంట్,రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్స్ కలిసి జాయింట్ గా ఈ సినిమాని నిర్మించనున్నారు.