`రిజ‌ర్వాయ‌ర్ డాగ్స్‌`, `ప‌ల్ప్ ఫిక్ష‌న్‌`,, `ఇంగ్లోరియస్ బాస్ట‌ర్డ్స్‌`, `ద హేట్‌ఫుల్ ఎయిట్‌` చిత్రాల‌కు దర్శకుడు క్వింటెన్‌ టారంటినో. అయితే ఆ చిత్రాలన్నీ ఒకెత్తు ఆయన డైరక్ట్ చేసిన  `కిల్ బిల్‌` చిత్రం ఒకెత్తు.  ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఈ చిత్రం త్వరలో హిందీలో రీమేక్ కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.  అయితే ఆ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ప్రముఖ పాత్ర పోషించబోతున్నట్లు వార్త.

అయితే  ఆయన చేయదగ్గ పాత్ర ఆ సినిమాలో ఏముంది. అది హీరోయిన్ ఓరియెంటటెడ్ సినిమా కదా అంటే... ఈ సినిమాలో ఆయన బిల్ పాత్రలో కనిపించనున్నారు. బిల్ పాత్ర అంటే విలన్ క్యారక్టర్. చాలా క్రూరమైన పాత్ర అది.  నటుడు–నిర్మాత నిఖిల్‌ దివేది ఈ రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించబోయే.... ఈ సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట నిఖిల్‌. ఆల్రెడీ ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ప్రారంభించారట.

ఈ మేరకు ఇఫ్పటికే  విలన్‌ బిల్‌ పాత్రలో నటించాల్సిందిగా షారుక్‌తో సంప్రదింపులు జరిపారట నిఖిల్‌. అయితే.. షారుక్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? లేదన్నది సస్పెన్స్ అంటున్నారు. అయితే దర్శకుడు నిఖిల్ మాత్రం ఖచ్చితంగా షారూఖ్ ఒప్పుకుంటారని చెప్తున్నారు.  షారుక్ ఖాన్ డర్ర్, బాజీగర్ సినిమాల్లో  నెగిటివ్ పాత్రలో కనిపించి అందరిని మెప్పించిన సంగతి తెలిసిందే.

ఇక షారుక్‌ హీరోగా నటించిన ‘జీరో’ గతేడాది డిసెంబరులో విడుదలైంది. ప్రస్తుతం షూటింగ్స్‌ లేవు. హీరోగా ఆచి ,తూచి అడుగులు వేస్తున్నారు. నిర్మాతగా బిజీగా ఉంటుున్నారు. రీసెంట్ గా జాన్ అబ్రహమ్ హీరోగా నటించిన బద్లా సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.అలాగే ఇమ్రాన్ హష్మి , శోభిత ధూళిపాల  ప్రధాన పాత్రల్లో నటించిన  "బార్డ్ ఆఫ్ బ్లడ్" వెబ్ సిరీస్ ని నిర్మించాడు.ఈ వెబ్ సిరీస్ అందరిని ఆకట్టుకుంటుంది.