తనదైన శైలి నటనతో, విభిన్నమైన కథల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు సత్యదేవ్. ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి  విలక్షణమైన సినిమాల్లో నటించిన సత్యదేవ్‌ త్వరలో ‘గాడ్సే’గా రానున్నారు. ఈ మేరకు ఆదివారం  ఆయన ఒక ట్వీట్‌ చేసి తెలియచేసారు. గతంలో ఆయన ప్రధాన పాత్రలో ‘బ్లఫ్‌మాస్టర్‌’ను తెరకెక్కించిన గోపిగణేష్‌ పట్టాభి దర్శకత్వంలో ‘గాడ్సే’ పట్టాలెక్కనున్నట్టు ప్రకటించారు. 

త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుందని, ఈ చిత్రానికి సి.కల్యాణ్‌ నిర్మాత వ్యవహిరిస్తున్నారని ట్వీట్‌లో తెలిపారు. గాడ్సే చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను ట్వీట్ చేశారు.పక్కనే వైన్‌ గ్లాస్‌, వెనుక మెషిన్‌గన్‌తో ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది.  గతంలో సత్యదేవ్ ను తన జ్యోతిలక్ష్మి సినిమాలో విలక్షణ పాత్రలో చూపించిన నిర్మాత సి. కళ్యాణ్ నే ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. సీరియస్ లుక్, గన్స్ బ్యాక్ గ్రవుండ్, గాడ్సే అనే టైటిల్ అన్నీ కలిసి సినిమా ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ గా వుండబోతోందని చెప్పకనే చెబుతున్నాయి.