బిగ్‌బాస్‌4 శనివారం మంచి ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. బిగ్‌బాస్‌ నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ లోనూ, ఆడియెన్స్ లోనూ ఊపొచ్చింది. అయితే సభ్యులపై బిగ్‌బాస్‌ ఆసక్తికర కామెంట్‌ చేశారు. వారి లోపాలను ఎత్తి చూపారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పి కొందరికి వార్నింగ్‌లు కూడా ఇచ్చాడు. 

ఇక శనివారం ఎపిసోడ్‌లో మెడల్స్ ఇచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. నేబర్‌ హౌజ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులు సోహైల్‌, అరియానా గ్లోరీలకు బొమ్మలున్న మెడల్స్ ఇచ్చి ఇతర సభ్యులకు ఏ మెడల్‌ సూట్‌ అవుతుందో వారికి ఇవ్వాలని, అందుకు కారణాలేంటో చెప్పాలనే కండీషన్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. మెడల్స్ ఇవ్వడం ప్రారంభించారు. ఫస్ట్ మెడల్‌ ఊసరవెళ్ళి అని రాసి ఉన్న మెడల్‌ని సుజాతకు ఇచ్చాడు. ఆమె అప్పుడే ఏడుస్తుందని, అంతలోనే నవ్వుతుందని, ఆ వెంటనే బాధపడుతుందని అందుకే ఊసరవెళ్ళి మెడల్‌ ఇచ్చామని తెలిపారు. 

కాకరకాయ మెడల్‌ దివికి ఇచ్చారు. ఆమె మాటలు కఠువుగా ఉంటాయని తెలిపారు. అఖిల్‌కి రొమాంటిక్‌ మెడల్‌ ఇచ్చారు. ఆయన చాలా మంచి వాడని, కేరింగ్‌ బాగా ఉంటుందని, అతనంటే ఇష్టమని అరియానా చెప్పింది. అంతలో నాగ్‌ కలగచేసుకుని మరోసారి అరియానాకి అన్నం తినిపించాలని అఖిల్‌కు చెప్పడంతో హౌజ్‌లో నవ్వులు పూసాయి. 

చిచ్చుపెట్టేది మెడల్‌ని కళ్యాణికి ఇచ్చారు. ఆమె ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తారని అందుకే పుల్లలు పెట్టే మెడల్‌ ఆమెకు ఇస్తున్నామని సోహైల్‌ చెప్పాడు. డ్రామ క్వీన్‌ మెడల్‌ హారీక ఇచ్చాడు. కానీ ఆమె అందుకు సూట్‌ కాదని నాగ్‌ చెప్పారు. ఇక సూర్య కిరణ్‌ బద్దకం మెడల్‌ని ఇచ్చారు. ఆయన ఏ పని చేయడని, అందుకే బద్దకం మెడల్‌ ఇచ్చామన్నారు. 

బకరా మెడల్‌ని లాస్యకి ఇచ్చారు. క్రయింగ్‌ బేబీ మెడల్‌ని మోనాల్‌కి, పర్‌ఫెక్ట్ మెడల్‌ని దివికి, మిర్చి మెడల్‌ని మెహబూబ్‌కి, జోకర్‌ మెడల్‌ని అమ్మ రాజశేఖర్‌కి ఇచ్చారు. ఇక తోపు మెడల్‌ని స్పెషల్‌ కంటెస్టెంట్‌ గంగవ్వకి ఇచ్చారు. ఆమె ఈ స్థాయికి చేరడంలో ఎన్నో కష్టపడిందని, ఇక్కడికి రావడం తోపు అని ఆమెకి ఆ మెడల్‌ని అందించారు. ఇక మిగిలించి చెత్తకుండి మెడల్‌. దాన్ని ముందుగా ఎవరికీ ఇవ్వలేమని సోహైల్‌ భావించాడు. కానీ అరియానా మాత్రం అభిజిత్‌కి ఇచ్చేసింది. ఆయన చేసే పనులు చెత్తగా ఉంటాయని తెలిపింది. ఇలా మెడల్స్ ఎపిసోడ్‌ రసవత్తరంగా  సాగి హైలైట్‌ అయ్యింది.