మ‌హేష్ సినిమా అన‌గానే  మీడియా హైప్ మాములుగా ఉండ‌దు. ఇప్ప‌టికే స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో అద‌ర‌గొట్టిన ఆయ‌న‌, ఇప్పుడు గీత‌గోవిందం సినిమా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాంతో స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టించ‌టానికి రెడీ అవుతున్నారు. హిట్ కాంబినేషన్ కావటం, మహేష్ బాబు ఫామ్ లో ఉండటంతో ఈ సినిమా రైట్స్ కోసం పెద్ద క్యూనే ఉంది. అయితే షూటింగ్ మొదలు కాకుండా థియోటర్ బిజినెస్ మొదలెట్టకూడదని ఆగారట.

 అయితే డిజిట‌ల్ రైట్స్, నాన్- థియరేటిక‌ల్ రైట్స్ ను అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు 35కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ను కూడా అమ్మేయ‌బోతున్నారు. అది కూడా భారీ రేటుకే అని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ నుండి అమెరికాలో మొద‌లుకాబోతుంది. 45రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.