కంటికి కనిపించకుండా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కోవిడ్ -19 భారత్ లో తన ప్రతాపం చూపిస్తోంది. ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న ఈ వైరస్ ఇప్పటికే ఎందరో రాజకీయ, క్రీడ, సినీ ప్రముఖులు ని పలకరించింది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మొన్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా సోకింది. దాంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. 

ఆ తర్వాత అనుపమ ఖేర్ ఫ్యామిలీ కరోనా బారిన పడింది. నిన్న మరో బాలీవుడ్ నటి కరోనా బారిన పడ్డారు.బాలీవుడ్ ప్రముఖ నటి రాచెల్ వైట్ తనకు కరోనా సోకినట్లు స్వయంగా తెలిపారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో ప్రవేశించింది. ఆమె కారు డ్రైవర్ కు కరోనా సోకినట్లు ప్రకటించారు.

తన డ్రైవర్ కు కరోనా సోకినట్లు ఆమె తన ఇనిస్ట్రా ఖాతా ద్వారా తెలియచేసారు. తనకు బృహన్ ముంబై కార్పొరేషన్ వారు ఈ విషయం తెలియచేసినట్లు చెప్పారు. అతన్ని క్వరంటైన్ లో ఉంచామని అన్నారు. అయితే తమ కుటుంబం మొత్తం టెస్ట్ చేయించుకున్నామని, అందరికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.

కేదార్‌నాథ్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా సింబా, లవ్‌ ఆజ్‌కల్‌ సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం కూలీ నెం.1 సినిమాలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.