Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ :యంగ్ హీరోయిన్ గంజాయి, డ్రగ్స్ అలవాట్లు రివీల్!

 తన వద్ద ఉన్న ‘హ్యాండ్ రోల్ జాయింట్స్’ ఆఫర్ చేసిందట. జాయింట్స్ అంటే ఒక విధమైన పోగాకుతో చుట్టిన చుట్టలు! ఆమె అవి వాడేదనీ, తనకు కూడా ఇచ్చిందనీ… రియా చెప్పిందని అంటున్నారు!

Sara Ali Khan rolled doobies, I smoked with her :  Rhea Chakraborty jsp
Author
Hyderabad, First Published Jun 7, 2021, 4:08 PM IST

రియా చక్రవర్తి.. హీరోయిన్‏గా కంటే ఎక్కువగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ లవర్ గానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. మరీ ముఖ్యంగా సుశాంత్ మరణం.. డ్రగ్స్ కేసు ఇలా వరుస వివాదాలు.. రియాను ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఇవే రీజన్స్ తో ఆమె కొద్ది రోజుల జైలు జీవితం గడిపిన రియా.. ఇటీవలే బెయిల్ పై విడుదలైంది. ఇటీవల రియా బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గోనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ లోగా రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మీడియా చేతికి చిక్కింది. అందులో సారా అలీఖాన్ పేరు కూడా ఉండటంతో బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది.

సుశాంత్ కేసులో భాగంగా జరిగిన విచారణలో రియా ఎన్సీబీ అధికారులకి సారా పేరుని కూడా చెప్పిందని బాలీవుడ్ మీడియా అంటోంది! ఆమెతో పాటూ కొన్నాళ్ల రియా జిమ్ లో వర్కవుట్స్ చేసేది. ఒకే జిమ్ కావటం ఇద్దరి మధ్యా ఫ్రెండ్ షిప్ పెరిగింది. ఆ సమయంలో రియాకి సారా తన వద్ద ఉన్న ‘హ్యాండ్ రోల్ జాయింట్స్’ ఆఫర్ చేసిందట. జాయింట్స్ అంటే ఒక విధమైన పోగాకుతో చుట్టిన చుట్టలు! ఆమె అవి వాడేదనీ, తనకు కూడా ఇచ్చిందనీ… రియా చెప్పిందని అంటున్నారు!

అంతేకాకుండా సారా అలీఖాన్ గంజాయి అలవాటు గురించి మరిన్ని సంచలన వివరాలు తెలిపింది రియా చక్రవర్తి! ‘కేదార్ నాథ్’ సినిమాలో కలసి నటించిన సుశాంత్, సారా అలీఖాన్ 2018-19 సంవత్సరాల్లో కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అదే సమయంలో మత్తు పదార్థం సేవించటం సుశాంత్ కి సారా నుంచీ అలవాటైందట. హ్యాంగోవర్ పోవాలంటే జాయింట్స్ ఊదటమే మంచి మార్గమని యంగ్ బ్యూటీ చెప్పేదట. 

ఇవన్నీ ఎన్సీబీ ఆఫీసర్స్ కి చెప్పిన రియా, థాయిలాండ్ లో సుశాంత్ 70 లక్షలు ఖర్చు చేసి స్నేహితులతో పార్టీ చేసుకున్నాడని చెప్పటం… బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. అతని వెంట అప్పట్లో సారా కూడా ఉందని రియా చక్రవర్తి చెబుతోంది. సారా అలీఖాన్ తనపై వస్తోన్న డ్రగ్స్ ఆరోపణల్ని ఎలా తిప్పికొడుతుందో చూడాలి అంటున్నారు బిటౌన్ జనం.మరో ప్రక్క సుశాంత్ రూమ్ మేట్ సిద్ధార్థ్ పితానీ కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా కేసు సారా మెడకి కూడా చుట్టుకోవచ్చు!  

Follow Us:
Download App:
  • android
  • ios