బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్ గత కొద్ది రోజులుగా డ్రగ్ కేసుకు సంభందించిన ఆరోపణలతో  ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఆమె పాత ఇంటర్వూ ఒకటి హఠాత్తుగా వైరల్ అవటం మొదలెట్టింది. ఆమెను బిచ్చెగత్తె అనుకుని డబ్బులు వేసినట్లు చెప్పిన వీడియో అది. 

ఆ వీడియోలో ఏముందంటే..సారా అలీ ఖాన్ ...తన చిన్నప్పుడు తన తల్లి ,తండ్రులు అయిన అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్ తో కలిసి వెకేషన్ కు వెళ్లింది.  అక్కడ ఆమె ఓ బిచ్చెగత్తె అని పొరబడే పరిస్దితి వచ్చింది. తన తల్లి,తండ్రి ఓ షాప్ లోకి వెళ్లారు. తను , తన సోదరుడు బయిట ఉన్నారు. దాంతో అక్కడ వస్తున్న ఓ పాటకు ఆమె డాన్స్ చేయటం మొదలెట్టింది. దాంతో అటుగా రోడ్డుపై పోయే జనం ఆగి డబ్బులు వేయటం మొదలెట్టారు. తను చిన్న పిల్ల కాబట్టి ఆ డబ్బులు తీసుకుంటోంది.

 ఈ లోగా సైఫ్, అమృత బయిటకు వచ్చి ఈ సీన్ చూసారు. అయితే అక్కడ హెల్ప్ గా ఉన్న వ్యక్తి...సారా క్యూట్ గా ఉండటంతో జనం ముద్దు చేసి డబ్బులు ఇచ్చారు అన్నారు. కానీ అప్పుడు సారా తల్లి ..క్యూట్ లేదు ..ఏమీ లేదు. బిచ్చెగత్తె అనుకుని డబ్బు వేస్తున్నారని చెప్పింది. ఆ తర్వాత నన్ను తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ నాకు ఆ సంఘటన పెద్దయ్యాక గుర్తు వచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడా ఆ వీడియో...ఆమె తల్లి చెప్పింది కరెక్టే అంటూ వైరల్ చేస్తున్నారు. 
 
బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే.  ఇందులోసారా అలీ ఖాన్‌, శ్రద్ధాకపూర్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

ఈ క్రమంలో శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌ లకు త్వరలోనే ఎన్‌సీబీ సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద ఇద్దరి నటులకు సమన్లు పంపనుంది. ఇక వీరిద్దరూ గతంలో సుశాంత్ తో నటించినవారే.. శ్రద్ధాకపూర్‌ సుశాంత్ తో చిచ్చోరే అనే సినిమాలో నటించగా, సారా అలీ ఖాన్ కేదార్‌నాథ్‌లో అనే సినిమాలో నటించింది.