Asianet News TeluguAsianet News Telugu

డైరక్టర్స్ కు,నిర్మాతలకు సప్తగిరి మెసేజ్ లు,ఫోన్స్

హ్యాపీడేస్' సినిమాలో నెల్లూరు కుర్రోడిలా.. అమాయకంగా కనిపించిన సప్తగిరి.. బన్నీ 'పరుగు' మూవీతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోపడ్డాడు. ఇక ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రం'లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన అమాయకత్వపు కామెడీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆట్టుకుంది. ఇక అంతే వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి సప్తగిరికి. 

Saptagiri is sending a message to all the directors
Author
Hyderabad, First Published May 20, 2020, 8:58 AM IST


తెలుగు పరిశ్రమలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత కమెడియన్‌గా మారి, ఆ తర్వాత హీరో అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. అయితే సప్తగిరి అతి తక్కువ కాలంలోనే తనలోని కామెడీ టింజ్ తో  ప్రేక్షకులను ఉర్రూతలూగించి కెరీర్ లో దూసుకుపోయాడు. హ్యాపీడేస్' సినిమాలో నెల్లూరు కుర్రోడిలా.. అమాయకంగా కనిపించిన సప్తగిరి.. బన్నీ 'పరుగు' మూవీతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోపడ్డాడు. ఇక ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రం'లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన అమాయకత్వపు కామెడీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆట్టుకుంది. ఇక అంతే వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి సప్తగిరికి. 

అలా సందీప్ కిషన్ మూవీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో బాగా పాపులర్ అయ్యాడు. తన మార్కు డిఫరెంట్ కామెడీని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాదాపు 70కు పైగా చిత్రాల్లో నటించిన తర్వాత సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా మారాడు. ఆ చిత్రం అందించిన విజయ స్ఫూర్తితో మళ్లీ హీరోగా సప్తగిరి ఎల్‌ఎల్‌బీ,‘వజ్ర కవచధర గోవింద’ వంటి చిత్రాలతో ముందుకొచ్చాడు.  అయితే హీరోగా అతను నిలదొక్కుకోలేకపోయాడు. ఈ విషయాన్ని త్వరగానే రియలైజ్ అయ్యాడు. సునీల్ లాగ ఎక్కువ టైమ్ పట్టలేదు. ఈ నేపధ్యంలో ఆ విషయం అర్దమయ్యేలా నిర్మాతలకు, దర్శకులకు మెసేజ్ లు పంపుతూ, ఫోన్స్ చేస్తున్నట్లు సమాచారం.

ఆ మెసేజ్ లలో ..తను కేవలం హీరో రోల్స్ మాత్రమే చేస్తానని భావించవద్దని, గతంలో లాగానే కామెడీ రోల్స్, క్యారక్టర్ రోల్స్ కు అందుబాటులో ఉంటానని చెప్తున్నారట. ఏ పాత్రకు అయినా తాను రెడీగా ఉన్నానని అంటున్నారట. వాస్తవానికి సప్తగిరిది మంచి డిక్షన్..విభిన్నమైన తరహాలో డైలాగులు చెప్తూంటాడు. సరిగ్గా కాన్సర్టేట్ చేస్తే యంగ్ కమిడియన్ గా మళ్లీ దూసుకుపోయే అవకాసం ఉంది. 

సప్తగిరి ఇదే విషయమై గతంలో మాట్లాడుతూ...నిజానికి నేను కమెడియన్‌ అవుదామని ఇండస్ట్రీలోకి రాలేదు. ‘సింధూరం, భారతీయుడు’ సినిమాలు చూసి ప్రేరణ పొంది వచ్చాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. కానీ నాకు కమెడియన్‌గా అవకాశాలు వచ్చాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం ఒక్కటే నాలో మంచి కమెడియన్‌ ఉన్నాడని నాకు తెలిసేలా చేసింది. హీరోగా మారిన తర్వాత నేను హాస్య పాత్రలు చేయనని దర్శక–నిర్మాతలే డిసైడ్‌ అయ్యారు. కమెడియన్‌ పాత్రలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను.  

Follow Us:
Download App:
  • android
  • ios