డ్రగ్స్, గర్ల్ ఫ్రెండ్స్ మొత్తం అన్నీ టచ్ చేస్తున్నారు!

sanju movie trailer talk
Highlights

బాలీవుడ్ తో సినిమా అభిమానులంతా ఎదురుచోస్తోన్న సినిమా 'సంజూ'

బాలీవుడ్ తో సినిమా అభిమానులంతా ఎదురుచోస్తోన్న సినిమా 'సంజూ'. సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక బాలీవుడ్ స్టార్ హీరో బయోపిక్ అంటే ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఆసక్తి ట్రైలర్ తో మరింత పెంచేసింది చిత్రబృందం.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రన్ బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. సంజయ్ దత్ జీబితమే ఆసక్తిదాయకంగా ఉంటుందనుకుంటే అంతకుమించి హిరానీ మేకింగ్ స్టైల్ ట్రైలర్ లో కనిపిస్తోంది. దత్ జీవితంలో చోటుచేసుకున్న డ్రగ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్రెండ్, అండర్ వరల్డ్, జైలు జీవితం ఇలా ప్రతి ఒక్క అంశాన్ని సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో అనుష్క శర్మ, సోనమ్ కపూర్, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

 

loader