బిగ్ బాస్2 షోలో మొదటి ఎలిమినేషన్ లో బయటకు వచ్చేసింది సంజనా. విజయవాడకు చెందిన ఈ మోడల్ ప్రస్తుతం అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. సంజన ఎలిమినేషన్ తో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ 2 నుంచి బయటకు వచ్చిన సంజన ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

బిగ్ బాస్ హౌస్ లోపల తనను జైల్లో పెట్టి హింసించారని సంజన వాపోయింది. తాను ఏ తప్పు చేయకపోయినా ప్లాన్ ప్రకారమే బయటకు పంపారని సంజన తెలిపింది. అంతేకాదు నాకు నూతన నాయుడుతో అప్పటికి ఒక గంట పరిచయం మాత్రమే. అలాంటిది ఇద్దరిని ఒకే బెడ్ ఉండే జైల్లో వేశారు. అదే బెడ్ పై ఇద్దరూ పడుకోండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు. అదెలా సాధ్యం అని అడిగితే మధ్యలో దిండ్లు అడ్డు పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. గంట పరిచయం ఉన్న వ్యక్తితో ఎలా పడుకుంటాను. ఒక వయస్సు వచ్చిన అమ్మాయి కనీసం నాన్న పక్కన కూడా పడుకోదు అని సంజన మండిపడింది. నూతన నాయుడు పక్కకు పడుకోమన్న వారి పేర్లని రివీల్ చేస్తారా అని అడిగితే.. టెలికాస్ట్ చేసి ఉంటె జనాలు తెలిసి ఉండేది అని సంజన తెలిపింది. ప్రస్తుతం ఈ వాఖ్యలు తీవ్ర ధూమారం రేపుతున్నాయి.