'నీ న్యూడ్ వీడియో నా దగ్గరుందంటూ' నటిని వేధించిన స్టార్ యాక్టర్!

Sandalwood actor Dharmendra accused of blackmailing actress
Highlights

గతేడాది ఓ నటీమణికి షూటింగ్ ఉందని చెప్పి రాత్రి సమయంలో ఇంటికి కారు పంపించాడట. తీరా ఆమె షూటింగ్ స్పాట్ కు వెళ్లిన తరువాత షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి డిన్నర్ కు ఆహ్వానించాడని తెలుస్తోంది. ఆమె తినే భోజనంలో, డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపి ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అశ్లీల వీడియో చిత్రీకరించాడు

సినిమాల్లో విలన్ వేషాలు వేసే ఓ స్టార్ యాక్టర్ రియల్ లైఫ్ లో కూడా విలన్ గా మారి నటిని వేధించడం మొదలుపెట్టాడు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు పాపులర్ అయిన ధర్మ అలియాస్ ధర్మేంద్ర అనే నటుడు నటించడంతో పాటు డాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేశాడు. సుదీప్ నటించిన 'హుచ్చా' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఆ తరువాత నటుడిగా బిజీ అయిపోయాడు.

అయితే గతేడాది ఓ నటీమణికి షూటింగ్ ఉందని చెప్పి రాత్రి సమయంలో ఇంటికి కారు పంపించాడట. తీరా ఆమె షూటింగ్ స్పాట్ కు వెళ్లిన తరువాత షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి డిన్నర్ కు ఆహ్వానించాడని తెలుస్తోంది. ఆమె తినే భోజనంలో, డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపి ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై అశ్లీల వీడియో చిత్రీకరించాడు. ఆమెకు మెలకువ వచ్చిన తరువాత ఆ వీడియో చూపిస్తూ డబ్బులు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా ఏడాది కాలంలో ఆమె నుండి రూ.14లక్షల వరకు రాబట్టాడు.

ఇంకా డబ్బులివ్వమని డిమాండ్ చేయడంతో బాధితురాలు తన భర్తకు విషయం మొత్తం చెప్పేసింది. దీంతో అతడు నేరుగా ఆమె ఇంటికెళ్లి బెదిరించాడు. దీంతో విసిగిపోయిన వారు ధైర్యం చేసి బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మ ఇండస్ట్రీలో కాస్త పేరున్న నటుడు కావడంతో పోలీసులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇటీవలే ధర్మేంద్ర అలానే కారు డ్రైవర్ నవీన్ లపై కేసు నమోదు చేశారు.    

loader