Asianet News TeluguAsianet News Telugu

శీలాన్ని రక్షించేందుకు రంగంలోకి దిగిన సంపూర్ణేష్ బాబు.. చివరికి తన శీలానికే..

 మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే కాన్సెప్టుతో మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం చేసే వ్యక్తి పాత్రలో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటించాడు.  

Sampoornesh Babu Cauliflower Movie Official Teaser
Author
Hyderabad, First Published Nov 17, 2021, 11:05 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సంపూర్ణేష్‌ బాబు హీరోగా ఆర్కే మలినేని తెరకెక్కించిన చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’. శీలో రక్షతి రక్షితః.. అన్నది ట్యాగ్ లైన్. ఆశా జ్యోతి గోగినేని నిర్మించారు. వాసంతి హీరోయిన్. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  శీలం ఆడాళ్లకే ముఖ్యమా ? మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే కాన్సెప్టుతో మగాడి శీలం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో పోరాటం చేసే వ్యక్తి పాత్రలో సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నటించాడు. ఇప్పటికే  ‘క్యాలీఫ్లవర్’ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ టీజర్ ని మీరు ఓ లుక్కేయండి.

ఈ టీజర్ చూస్తుంటే.. ఆకాశవాణి నా ఘోష ఏంటో ప్రజలకు తెలియాలి. మధ్యలో వేశ్యలకు పెళ్లిళ్లేంటి రా.. ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబలేరా.. ఈ క్యాలీఫ్లవర్ అంటూ సంపూ చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా సంపూర్ణేష్ బాబు తరహా కామెడీతో సాగిపోయేలా ఈ టీజర్ ఉంది. మొత్తంగా మగాడి శీల రక్షణ కోసం చట్టం తేవడమే తన పోరాటం నేపథ్యంలో సెటైరికల్‌గా ఈసినిమాను తెరకెక్కించారు. 

  ‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నారు సంపూర్ణేష్ బాబు. ఆ తర్వాత బర్నింగ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. వరసపెట్టి సంపూర్ణేష్ బాబు.. సింగం 123, కొబ్బరిమట్ట వంటి సినిమాలతో తనకంటూ సెటైర్స్ సినిమాలతో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ బర్నింగ్ స్టార్ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇప్పటకే సంపూర్ణేష్ బాబు.. ‘బజార్ రౌడీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంపూర్ణేష్ బాబు ‘క్యాలీఫ్లవర్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా సంపూ... ఇంగ్లీష్ దొరబాబు గెటప్‌లో ఓ పోస్టర్‌ను విడుదల చేసి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసారు.

Also read Bigg boss telugu5:ఎలిమినేట్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ వీడిన కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా... ఆ టార్చర్ తట్టుకోలేక!

 సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘ఒక మగాడు తనకు జరిగిన అన్యాయంపై చేసిన పోరాటమే ఈ ‘క్యాలీఫ్లవర్‌’. నిర్మాతలకు తొలి చిత్రమైనా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఇచ్చే ప్రయత్నం చేశా. అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి ఇంత మంచి సినిమాలో అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. ప్రజ్వల్‌ అద్భుతమైన సంగీతమిచ్చార’’ అంది హీరోయిన్ వాసంతి. ఈ సినిమాకి సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, ఛాయాగ్రహణం: ముజీర్‌ మాలిక్‌.

Also read Nayeem diaries trailer: ఉద్యమంలోనుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం.. చివరగా నక్సల్స్ గానే ఉండాలనుకున్నాడా?
 

Follow Us:
Download App:
  • android
  • ios