మరో క్రేజీ ప్రాజెక్ట్ తన ఖాతాలో వేసుకున్న సమంత తన స్టార్డం ఏమిటో తెలియజేసింది. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ సమంత హీరోయిన్ గా ఓ మూవీ ప్రకటన చేశారు. శాకుంతలం పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్ అండ్ కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. ప్రకృతి వడిలో పెరిగిన స్వచ్ఛమైన ఆడపిల్ల కథగా ఈ మూవీ ఉండే అవకాశం ఉంది. కాన్సెప్ట్ వీడియోతోనే మూవీపై హైప్ భారీగా పెంచేశాడు గుణశేఖర్. 

పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. సమంత నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ శాకుంతలం కావడం విశేషం. అలాగే టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీగా కూడా చెప్పవచ్చు. అనేక ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రం ఎన్ని సంచలనాలు నమోదు చేయనుందో చూడాలి. శాకుంతలం చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. 

తెలుగులో సమంత చివరి చిత్రం జాను. ఆ మూవీ తరువాత ఆమె మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు. సడన్ గా భారీ ప్రాజెక్ట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. న్యూ ఇయర్ వేడుకలకు గోవా వెళ్లిన సమంత అక్కడ భర్త నాగ చైతన్యతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శాకుంతల ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో స్పందించారు సమంత. దర్శకుడు గుణశేఖర్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.