స్టార్ హీరోయిన్ సమంత ఫిట్నెస్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అక్కినేని వారి కోడలిగా అన్నీ ఉన్నా ఏదో సాధించాలన్న తపన సమంతలో చూడవచ్చు. సినిమా పరంగా కౌంట్ తగ్గించిన సమంత సరికొత్త రంగాలలో రాణించాలని కోరుకుంటున్నారు. బిగ్ బాస్ హోస్ట్ గా కూడా సత్తా చాటిన సమంత మామకు తగ్గ కోడలు అనిపించారు. ఫిట్నెస్ విషయంలో సమంత నాగార్జునను మించిపోయారు. 

ప్రతి రోజు వ్యాయామం, స్ట్రిక్ట్ డైట్ సమంత దిన చర్యలో భాగం. తీసుకొనే ఆహారం కూడా తాజాగా తన హౌస్ గార్డెన్ లో రసాయనాలకు దూరంగా పండించుకుంటారు. అలాగే సమంత ప్లాంట్ బేస్డ్ డైట్, వ్యాయామం మొదలుపెట్టినట్లు ఉన్నారు. ఈ విభాగంలో ఎక్స్పర్ట్ అయిన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో కఠిన వ్యాయామం చేస్తున్న వీడియోని సమంత ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. వర్క్ అవుట్ వేర్ లో సమంత స్లో స్లిమ్ అండ్ సెక్సీగా ఉన్నారు. 

మరోవైపు ఆహా యాప్ కోసం సమంత సామ్ జామ్ పేరుతో టాక్ షో నిర్వహించనున్నారు. సామ్ జామ్ టాక్ షోలో సమంత టాలీవుడ్ సెలెబ్స్ ని ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇప్పటికే ఈ షో  షూటింగ్ మొదలుకాగా మొదటి గెస్ట్ గా విజయ్ దేవరకొండ వస్తున్నారట. ఈ ఎపిసోడ్ షూటింగ్ నిర్వాహకులు పూర్తి చేశారని సమాచారం. హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అయినసమంత సామ్ జామ్ ద్వారా ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం.