Asianet News TeluguAsianet News Telugu

సమంతని ఆశ్చర్యంలో ముంచెత్తిన అనుష్క.. ఏం జరిగిందంటే..

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంత. వివాహం తర్వాత కూడా సమంత జోరు తగ్గడం లేదు. సౌత్ వరకే స్టార్ హీరోయిన్ గా ఉన్న సామ్.. రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 2తో ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

Samantha says she was in disbelief when Anushka Sharma once DMed her
Author
Hyderabad, First Published Aug 30, 2021, 11:57 AM IST

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంత. వివాహం తర్వాత కూడా సమంత జోరు తగ్గడం లేదు. సౌత్ వరకే స్టార్ హీరోయిన్ గా ఉన్న సామ్.. రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 2తో ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యామిలీ మ్యాన్ లో రాజి పాత్రలో సమంత అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకు చివరగా సోషల్ మీడియాలో డైరెక్ట్ మెసేజ్ చేసిన సెలెబ్రిటీ ఎవరు అని ప్రశ్నించగా.. సమంత అనుష్క శర్మ పేరు చెప్పింది. అనుష్క నా ఇంస్టాగ్రామ్ స్టోరీకి రియాక్ట్ అవుతూ మెసేజ్ చేయడంతో నమ్మలేకపోయాను. 

ఏంటి అనుష్క శర్మ నాకు మెసేజ్ చేసిందా అని ఆశ్చర్యపోయాను. ఈ సందర్భంగా సమంత అనుష్క శర్మపై ప్రశంసలు కురిపించింది. అనుష్క శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చైతన్యం కలిగించే పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఆమె సందేశాలు చాలా విలువైనవి. 

అనుష్క శర్మ సోషల్ మీడియాని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని సమంత పేర్కొంది. అనుష్క గర్భవతిగా ఉన్నప్పుడు.. విరాట్, అనుష్క మ్యారేజ్ యానవర్సరీకి సమంత సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీతో రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios