గత కొంతకాలంగా సమంత అక్కినేని ఏ సినిమా ఒప్పుకోవటం లేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతీ స్క్రిప్టుని ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళాలని ఫిక్సై ఆ దిసగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే వరస పెట్టి హిట్స్ ఇచ్చి మంచి క్రేజ్ లో ఉన్న సమంత ఇలా వరస పెట్టి తన దగ్గరకు వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేయటం ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా 
సమంత తెలుగులో ‘జాను’ సినిమా తర్వాత మరే ఇతర తెలుగు సినిమా కమిటవ్వలేదు. అందుకు కారణం ఆ సినిమాపై ఆమె పెట్టుకున్న ఎక్సపెక్టేషన్స్ ...తల క్రిందులు అవటమే అంటున్నారు.  ఆమె నుంచి ఓ పెద్ద ఎనౌన్సమెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేఫధ్యంలో సమంత ఓ కొత్త సినిమా కమిటైందని, అదీ పెద్ద బ్యానర్ నుంచి అనే వార్త అభిమానులకు ఆనందం కలగచేస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేస్తుందట. దానికోసం సమంతని ఒప్పించడానికి సోనీ పిక్చర్స్ రంగంలోకి దిగి ఒప్పించిదని తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు ఆ చిత్రం ద్వారా పరచయం కానున్నాడు. ఈ సినిమాకు సంభందించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ లోగా లాక్ డౌన్ రావటంతో ప్రక్కన పెట్టి షూట్ కు వెయిట్ చేస్తున్నారట. ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.  లాక్ డౌన్ ముగియగానే.. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని చెప్తున్నారు.  సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది వారి ప్లాన్‌గా చెబుతున్నారు.

 ఇదిలా ఉంటే సమంత తాజాగా నటిస్తున్న తమిళ సినిమా నుండి కూడా తప్పుకుంది అనే వార్త ఒకటి ప్రచారంలోకొచ్చింది. అలాగే ఆ మధ్యన ఓ బేబీ దర్శకురాలి తో సినిమా అన్నప్పటికీ.... నందిని రెడ్డి  క్లారిటీ ఇచ్చింది. సమంత తో నేను సినిమా చెయ్యడం లేదని చెప్పింది. అలాగే కన్నడలో హిట్ అయిన దియా సినిమాని సమంత రీమేక్ చేస్తుంది అనే టాక్ ఉంది. అదీ నిజమయ్యేలాగ లేదట.  ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో చైతు తో కలిసి సమయాన్ని గడుపుతోంది.