దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అక్కినేని ఇంటి కోడలైన తరువాత ఆమెకు సపోర్ట్ మరింత పెరిగింది. పెళ్లి అయిన తరువాత సమంత గ్లామర్ షో తగ్గిస్తుందేమోనని అభిమానులు భావించారు.

కానీ ఆ విషయంలో సమంత అస్సలు తగ్గడం లేదు. పైగా డోస్ కాస్త పెంచింది. దీంతో అప్పుడప్పుడు అభిమానులతో చీవాట్లు తింటూనే ఉంది. తన ఇన్స్టాగ్రామ్ లో సామ్ కాస్త స్పైసీ ఫోటోలు పెట్టినా చాలు.. వెంటనే అభిమానులు ఆమెని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితిని మరోసారి ఎదుర్కోవాల్సి వచ్చింది సామ్.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో డెనిమ్ జీన్స్, ప్రింటెడ్ కలర్స్ ఉండే ఒక షర్ట్ వేసుకుంది. ఆ ఫోటో సెక్సీగా ఉండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా సమంత తన ముఖం సగం మాత్రమే కనిపించేలా ఫోటో తీయడంతో ఇదొక స్పెషల్ ఫోటోగా మారింది.

జనాల రెస్పాన్స్ ఎలా ఉన్నా.. తనకు సంబంధం లేదంటూ సామ్ తన స్పైసీ ఫోటోషూట్లను కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఓ బేబీ' రిలీజ్ కి సిద్ధమగా ఉంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది.