టాలీవుడ్ స్టార్ కపుల్ చైతన్య , సమంత ప్రస్తుతం గోవాలో ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్  కోసం ఈ జంట ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లడం జరిగింది. గోవాలో తన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి సంబందించిన ఫొటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పంచుకుంటోంది. ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ విషెష్ చెబుతూ సమంత ఓ రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నాగచైతన్యకు ముద్దు పెడుతూ తీయించుకున్న ఫొటోను ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఆ ఫొటోకు రొమాంటిక్ కపుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

సమంత, చైతూల ఈ రొమాంటిక్ పోజ్ నెటిజన్స్ తెగ నచ్చేసినట్లు ఉంది. అందుకే లైక్స్ తో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఆ ఫొటోకు వన్ మిలియన్స్ కి పైగా లైక్స్ దక్కడం విశేషం. లవ్ మ్యారేజ్ చేసుకున్న సమంత, చైతు మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ని ఇద్దరూ భలే బ్యాలన్స్ చేస్తున్నారు. 

సమంత ప్రస్తుతం సామ్ జామ్ టాక్ షోకి హోస్ట్ గా ఉన్నారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుంది. ఇక నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ త్వరలో విడుదల కానుంది. షూటింగ్ పూర్తి అయినట్లు వార్తలు వస్తుండగా... నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.