మీడియా వాళ్లు అదిగో పులి అంటే ఇదిగో తోక అనేస్తారు. ఏ వార్త లేకపోతే..మామూలు న్యూస్ కే కాస్తంత మసాలా కలిపి బిర్యాని వండి వడ్డించేస్తారు. అయితే కొన్ని వార్తలు ఎవరి కెరీర్ కు కానీ, వ్యక్తిగత జీవితానికి కానీ ఏ సమస్యలూ తెచ్చిపెట్టవు.
కానీ కొన్ని వినగానే విసుగనిపిస్తాయి. ఆ వార్త రాసిన వారిపై మండిపడేలా చేస్తాయి. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి మీడియాలో సమంత పేరు మీదగా హల్ చల్ చేస్తోంది. 

 ఆ వార్త ఏమిటంటే...సమంత ...తన మాజీ ప్రియుడు, హీరో సిద్ధార్థ్ సంచలన వాఖ్యలు చేసిందని. మహానటి సావిత్రి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చాయో అలాగే తన జీవితంలో కూడా చోటు చేసుకున్నాయని సమంత పేర్కొందనీను. అయితే తాను ముందుగానే నేను పసిగట్టడంతో జాగ్రత్తపడ్డాను కాబట్టే నా జీవితం ఇపుడు సాఫీగా సాగిపోతుందంటూ చెప్పుకొచ్చిందని ఆ వార్తల సారాంశం. `మోస్ట్ డిజైరబుల్ ఉమెన్`గా అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన వైవాహిక జీవితం గురించి కొన్ని వాఖ్యలు చేసిన మాట నిజం.   చైతన్య లాంటి మంచి భర్తకు భార్యను కాగలిగానని సమంత వెల్లడించింది. 

అయితే మీడియా దానికి మసాలా కలిపేసి,పులిహార వార్త వండేసింది. సిద్దార్ద్ ని విమర్శించిందని, లేకపోతే తన బ్రతుకు మహానటిలా సావిత్రిలా అయ్యిపోయేదని అందని ఆ వార్తల సారాంశం. చిత్రం ఏమిటంటే ఆమె అసలు సిద్దార్ద్ విషయం ఎత్తలేదు. సిద్దార్ద్ గురించి గుర్తు చేసి వార్తల్లోకు ఎక్కాల్సిన అవసరం ఆమెకు లేదు. ఆమె పాత ఇంటర్వూ ఒకటి బయిటకు తీసి దాన్ని ఇప్పుడు లేటెస్ట్ ఇంటర్వూలో చెప్పినట్లుగా ప్రచారం చేస్తున్నారు నాగచైతన్య, ఆమె..చక్గా. సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా   కొనసాగుతున్నారు. ఇక గత ఈ ఏడాది జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేనప్పటికీ తమిళ్ లో విజయ్ సేతిపతి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే త్వరలో గేమ్ ఓవర్ దర్శకుడుతో సినిమా ప్రారంభిస్తోంది. ఏప్రియల్ నుంచి ఈ తెలుగు,తమిళ సినిమా ప్రారంభం కానుంది.