టాలీవుడ్ లక్కీ లేడీ సమంత హోస్ట్ గా మారనున్న సంగతి తెలిసిందే. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా కోసం ఆమె సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ టాక్ షో షూటింగ్ మొదలుకాగా మొదటి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొననున్నారు. మొదటి ఎపిసోడ్ గా సమంత హీరో విజయ్ దేవరకొండతో టాక్ షో నిర్వహించినట్లు సమాచారం. 

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ విజయ్ దేవరకొండ సామ్ జామ్ సెట్ లో కనిపించారు. త్వరలో ప్రసారం కానున్న ఈ టాక్ షో కొంచెం బోల్డ్ గానే సాగుతుందని సమాచారం. సమంత విజయ్ దేవరకొండను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారట. విజయ్ దేవరకొండ పరిశ్రమకు వచ్చాక హీరోయిన్స్ తో పెట్టుకున్న ఎఫైర్స్ , ఆయన సీక్రెట్స్ కూడా బయటికి లాగనున్నారని సమాచారం. 

విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందానతో ఎఫైర్ నడిపారని కథనాలు రావడం జరిగింది. విజయ్, రష్మిక రెండు సినిమాలలో కలిసి నటించగా, ఈ రెండు సినిమాలలో వీరి కెమిస్ట్రీ చూసిన ప్రేక్షకుల వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చెవులు కొరుకున్నారు. ఆ మధ్య దేవరకొండ ఇంటిలో జరిగిన ఓ బర్త్ డే వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు కేవలం రష్మిక మందాన కనిపించడం, ఈ అనుమానాలను బలపరిచింది. 

ఈ విషయాలపై సమంత విజయ్ దేవరకొండను ప్రశ్నించనున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్ తో మరో చిత్రం ప్రకటించడం జరిగింది.