Asianet News TeluguAsianet News Telugu

ఈ విపత్కర పరిస్థితి నాకో పాఠం నేర్పింది: సమంత

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా సాధారణ గృహిణిగా మారిపోయింది. ఈ లాక్‌ డౌన్‌ కాలమంత భర్త నాగచైతన్యతో కలిసి ఇంట్లోనే ఏన్న సమంత తోట పని చేస్తూ టైం పాస్‌ చేస్తోంది. ఈ సందర్భంగా లాక్‌ డౌన్‌ కాలంలో తన అనుభవాలను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

Samantha Akkineni learnt to grow her own food
Author
Hyderabad, First Published Jul 31, 2020, 6:43 PM IST

లాక్‌ డౌన్‌ కారణంగా ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సెలబ్రిటీలు కూడా ఇళ్లు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సినీ తారలు తమ వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. ఎప్పుడు సినిమాలు, ప్రయాణాలతో బిజీగా ఉండే ఫిలిం స్టార్స్‌ కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కొంత మంది తారలు తన ఫిజిక్‌ మీద దృష్టి పెట్టి వర్క్‌ అవుట్స్‌ చేస్తుంటే, మరికొందరు ఇంటిపనిలో బిజీ అయ్యారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా సాధారణ గృహిణిగా మారిపోయింది. ఈ లాక్‌ డౌన్‌ కాలమంత భర్త నాగచైతన్యతో కలిసి ఇంట్లోనే ఏన్న సమంత తోట పని చేస్తూ టైం పాస్‌ చేస్తోంది. ఈ సందర్భంగా లాక్‌ డౌన్‌ కాలంలో తన అనుభవాలను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

`ప్రతి ఒక్కరూ క్రియేటివ్‌ ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది డ్యాన్స్ చేస్తారు. ఇంకొంతమంది ఆర్ట్, వంట చేయడం లాంటి పనులు చేస్తారు. నేను అలాంటివి చేయలేను. అయితే నేను కూడా కాస్త భిన్నమైన పని ఎంచుకున్నా. నేను దేని గురించి చెబుతున్నానో మీకు తెలుసనుకుంటున్నా. దానికి సంబంధించిన విషయాలన్నింటినీ ఇప్పటికే మీకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాను.

అయితే ఈ తోటపని ఎందుకు ఎంచుకున్నానో మీకు తెలియజేయాలనుకుంటున్నా. లాక్‌డౌన్ గురించి తెలిసిన తర్వాత అందరిలాగానే మేం ఆశ్చర్యపోయాం. చైతూ, నేను వెంటనే సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కు పరిగెత్తాం. తెచ్చుకున్న సరుకులు ఎన్ని రోజులు వస్తాయో లెక్క పెట్టుకునే వాళ్లం. అవి అయిపోయిన తర్వాత ఏమి చేయాలోనని భయపడేవాళ్లం. ఈ విపత్కర పరిస్థితి నాకో పాఠం నేర్పింది. మనకు కావాల్సిన ఆహారాన్ని మనమే ఎందుకు పండించుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. దాంతో నేను స్వయంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టా` అంటూ సమంత తన వీడియోలో వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios