Asianet News TeluguAsianet News Telugu

సినిమాలో సెక్స్ సీన్లు, ముద్దు సీన్లు.. స్టార్ హీరో ఏం అంటున్నాడంటే..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో ముద్దు సన్నివేశాలు, సెక్స్ సన్నివేశాల గురించి చేసినవ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా హిట్, ఫ్లాప్ లలో ముద్దు, సెక్స్ సన్నివేశాల పాత్ర గురించి సల్మాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Salman Khan Thinks 'Sex And Skin' Can't Sell a Film
Author
Hyderabad, First Published Oct 2, 2018, 10:17 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో ముద్దు సన్నివేశాలు, సెక్స్ సన్నివేశాల గురించి చేసినవ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. సినిమా హిట్, ఫ్లాప్ లలో ముద్దు, సెక్స్ సన్నివేశాల పాత్ర గురించి సల్మాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదని ఆయన అన్నారు. ఈరోజుల్లో చాలా సినిమాలలో హాట్ సీన్లు, ఘాటైన ముద్దులు ఉంటున్నాయి. ఇండియన్  సినిమాలలో ఈ తీరు రోజురోజుకి పెరుగుతోంది. బాలీవుడ్ నుండి మొదలై ఇప్పుడు ప్రాంతీయ భాషలకు కూడా ఇది పాకింది.

సినిమాలపై ప్రేక్షకుల దృష్టి పడడానికి దర్శకనిర్మాతలు బోల్డ్ సీన్స్ ఎక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్ చెప్పిన అభిప్రాయం ఆసక్తికరంగా  మారింది.

''కుటుంబంతో కలిసి ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఉన్నట్టుండి సినిమాలో ముద్దు సన్నివేశాలు వచ్చినప్పుడు సినిమా చూస్తున్న కుటుంబ సభ్యులంతా ఇబ్బందికరంగా ఫీలయ్యే వారు. అలాంటి పరిస్థితిని కల్పించే సినిమాలకు ఆదరణ ఎలా లభిస్తుందని'' సల్మాన్ ప్రశ్నించాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios