Asianet News TeluguAsianet News Telugu

#Salaar:‘సలార్’ఏమన్నా సలాడ్ అనుకున్నారా, అన్నీ కలపటానికి

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ అవతారంలో ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.

Salaar deals with a devotee of Goddess Kali?
Author
First Published Oct 18, 2022, 6:28 AM IST


 కేజీయఫ్  రెండు పార్ట్ లతో  ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కంటిన్యూ షెడ్యూల్స్ తో  షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో  వార్త మీడియాలో, సోషల్ మీడియాలో  జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

 తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.  సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు  డివోషనల్ టచ్ ఉంటే విధంగా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని,అవే హైలెట్ అని అంటున్నారు. సలార్ చిత్రంలో ప్రభాస్ కాళీ మాత భక్తుడిగా కనిపిస్తాడని.. ఈ క్రమంలో దుష్టశక్తులను అడ్డుకునే పనిలో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే ఇది గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమాలో బాలయ్య శివుడి భక్తునిగా చేసిన ఊచకోత ఎలా ఉందో మనం చూశాం. ఇప్పుడు అలాంటి పాత్రలోనే ప్రభాస్ కూడా కనిపిస్తుండటంతో ఈ సినిమాలోనూ యాక్షన్ సీక్వెన్స్ అదే రేంజ్‌లో ఉండబోతుందని అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజం లేదని, ఇది మీడియా,కొందరు అభిమాన ఉత్సాహంవతులు వండిన వంటేనని,  సలార్ సినిమా ఏమన్నా సలాడ్ ..అన్ని ముక్కలు కలపటానికి మరికొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏది నిజం..ఏది రూమర్ అని తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వినిపిస్తోంది.సలార్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని కన్నడ సినీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సలార్ సినిమాతో ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 28న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios