ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్‌ కే నాయుడు కేసులో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నటి సాయి సుధ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్‌కేనాయుడుని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు. అయితే రిమాండ్‌కు వెళ్లిన రెండు రోజుల్లోనే అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు

ఈ నేపధ్యంలో హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మురళీ కృష్ణపై నటి శ్రీసుధ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన నుంచి మురళీ కృష్ణ డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్‌ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి శ్రీ సుధ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ కేసు దర్యాప్తు కోసం మురళీ కృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని తెలిపారు. ఈ కేసులో శ్యామ్‌ కె.నాయుడును అరెస్టు చేయకపోవడంతోపాటు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్‌ సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐతో మాట్లాడిన సాక్షాలను కూడా ఆమె ఏసీబీకి అందజేశారు.