సినిమా ప్రారంభానికి ముందు రకరకాల కాంబినేషన్స్ ను ఊహిస్తూంటారు దర్శక,నిర్మాతలు. అయితే డేట్స్ ప్లాబ్లం వల్ల, రెమ్యునేషన్ ఇబ్బందులతో వేరే వారు ఆ ప్లేస్ లో వచ్చి ఆక్యుపై చేస్తూంటారు. ముఖ్యంగా స్టార్స్ సినిమాలకు ఇది ఎక్కువగా జరుగుతూంటుంది. అలాగే మహేష్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మొదట సాయి పల్లవినే హీరోయిన్ గా అనుకున్నారట. దర్శకుడు ఆమెను సంప్రదించి కథ కూడా చెప్పారట. నిర్మాతలు కూడా ఆమే ఫైనలైజ్ అవుతుందని భావించారట. కానీ ఫైనల్ ట్విస్ట్ ..రష్మిక సీన్ లోకి వచ్చింది. అందుకు కారణం ...సాయి పల్లవి నో చెప్పటమే అంటున్నారు. 

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...స్క్రిప్టు పూర్తయ్యాక మొదట సాయి పల్లవి దృష్టిలో పెట్టుకునే హీరోయిన్ క్యారక్టర్ డిజైన్ చేసారట. మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ చిత్రంగా ఆమెకు కథ చెప్పాక నో చెప్పిందిట. అందుకు కారణం ..తనకంటూ సినిమాలో చేయటానికి ఏమీ లేదని, ముఖ్యంగా సెకండాఫ్ లో హీరో వెనక ఉండటం తప్ప తనేమీ చేయటం లేదని, ఆ పాత్ర తనే చెయ్యాలనిపిస్తేనే చెస్తానని, ఎవరైనా చేసినా ఓకే అనిపించే పాత్రలు తనకు ఇష్టముండవని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పి నో చెప్పేసిందిట. దాంతో రష్మిక దగ్గరకు వెళ్లి ఓకే చేయించుకున్నారట. 

ఇక మొన్న సంక్రాంతికి మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా విడుదలై భారీ సక్సెస్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రం అల.. వైకుంఠపురములో మూవీతో పోటీ పడినప్పటికీ...తన స్టామినాని నిరూపించుకుంది. మహేష్ ఖాతాలో ఓ సూపర్ హిట్ ని చేర్చింది.  లాక్ డౌన్ లేకపోతే , థియోటర్స్ ఓపెన్ గా ఉంటే ఖచ్చితంగా వంద రోజులు సెంటర్లు కొన్నైనా ఉండేవి. ఖచ్చితంగా నిర్మాతలు ఈ పంక్షన్ ని చేసేవారు. ఆ ఆనందం లేకుండా పోయింది. లాక్ డౌన్ ఈ సినిమా నిర్మాతలకు పెద్ద జోల్ట్ ఇచ్చింది. ఏదైమైనా ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాల గత రికార్డులను పూర్తిగా తుడిచిపెట్టేసింది ఈ చిత్రం.  ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది.  

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జనవరి నెల 11న విడుదలైంది.