Asianet News TeluguAsianet News Telugu

సాయి పల్లవి 'అనుకోని అతిథి' రివ్యూ

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా `అధిరన్`. ఇప్పుడు ఈ చిత్రాన్ని అనుకోని అతిథి పేరుతో తెలుగులో విడుదల చేసారు.

Sai Pallavi and Fahad Faasil's Anukoni Athidhi movie review jsp
Author
Hyderabad, First Published May 28, 2021, 10:09 AM IST

మన టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో ఎలా పండిపోయిందో, అలాగే మళయాళి వాళ్లు క్రైమ్ థ్రిల్లర్స్ వండి వార్చటంలో ఓ స్దాయికి వచ్చేసారు. ఓటీటిల పుణ్యమా అని అక్కడ మళయాళంలో హిట్టైన సినిమాలన్ని తెలుగులోకి డబ్బింగ్ వెర్షన్ లుగా వస్తున్నాయి. విషయమున్న సినిమాలు కావటంతో మంచి ఆదరణ కూడా దక్కుతోంది. అదే విధంగా..2019లో మళయాళంలో వచ్చిహిట్టైన సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘అతిరన్‌’ను తెలుగులో 'అనుకోని అతిథి సినిమాని తెలుగులోకి డబ్ చేసారు. సాయి పల్లవి డిఫరెంట్ రోల్‌లో కనిపించిన సినిమా కావటంతో అందరిలో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఎక్సపెక్టేషన్స్ కు తగ్గ స్దాయిలో సినిమా ఉందా...మన తెలుగువాళ్లకు నచ్చుతుందా, సాయి పల్లవి మ్యాజిక్ చేయగలిగిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
కథ:

1967 కథా ప్రారభం. ఒక పెద్దావిడ ఓ పెద్ద భవంతిలోకి వెళ్లి షాకింగ్ గా చూడటంతో మొదలవుతుంది. అక్కడో మూడు హత్యలు జరిగి ఉంటాయి. ఆవిడ షాకై పోయి..ఇంకాస్త లోపలకి వెళ్లి చూస్తే ఒకమ్మాయి తాడుతో ఆడుకుంటూంటుంది. ఆమెను చూసిన ఆ పెద్దావిడ ఓ సూటుకేసులో ఓ డైరీ పెడుతుంది. సినిమా ఐదేళ్ల ముందుకు వెళ్తుంది. అడవిలో ఓ ట్రక్ వెళ్తూంటుంది. ట్రక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి..వెనక కూర్చున్న అతన్ని చూసి..మీరు అంతా బాగానే ఉన్నారు కదా...ఆ పిచ్చాసుపత్రికి ఎందుకు వెళ్తున్నారు అంటాడు. అతను సరైన సమాధానం చెప్పడు. కాసేపటికి ఆ ఆసుపత్రి దగ్గరలో ట్రక్ ఆగితే దిగుతాడు. అతనే నంద (ఫహ‌ద్ ఫాజిల్). నంద ట్రక్ దిగి నడుస్తూ.. అదే హాస్పటిల్ కు వెళ్తున్న ఓ వ్యక్తితో మాటలు కలిపుతాడు. మాటల మధ్యలో అవతలి వ్యక్తి తాను ఆ హాస్పటిల్ లో పనిచేస్తానని, ఇది చాలా భయంకరమైన ప్లేస్ అని,ఇక్కడ ఈ అడవిలో ఎవరినైనా చంపి పడేస్తే అడిగే  దిక్కులేదు అంటాడు. ఆ తర్వాత నందని మీరు ఎవరూ అంటే తాను ఇక్కడ పిచ్చాసుపత్రిలో జరుగుతున్న విషయాలను గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటానికి వచ్చిన సైక్రాటిస్ట్ నంద (ఫహ‌ద్ ఫాజిల్) ఫ్రమ్ త్రివేండ్రమ్ మెడికల్ కాలేజి అని  చెప్తాడు. దాంతో ఆ వ్యక్తి గుండెల్లో రాయిపడుతుంది. 

మనకీ ఆ పిచ్చాసుపత్రిలో ఏవో జరగకూడనవి చాలా జరుగుతున్నాయని, అవి బయిటకు రానివ్వటం లేదని,  అది చాలా ప్రమాదమైన ప్రాంతంలో ఉన్న హాస్పటిల్ అని రివీల్ అవుతుంది. మరి కాసేపటికి ఆ హాస్పటిల్ లో ఉన్న మరిన్ని పాత్రలు పరిచయం అవుతాయి. ఆ హాస్పటిల్ మెయిన్ డాక్టర్(అతుల్ కులకర్ణి)చాలా క్రూరంగా బిహేవ్ చేస్తూంటాడు. అక్కడంతా అతని మనుష్యులే. హాస్పటిల్ చెకింగ్ వచ్చిన వారు తమ మాట విని,తమకు అనుకూలంగా రిపోర్ట్ రాయకపోతే చంపేయటానికి కూడా వెనకాడరు అని చెప్తారు. అందుకు తగినట్లుగానే నందపై మర్డర్ ఎటెమ్ట్స్ జరుగుతాయి. అయినా నంద ధైర్యం కోల్పోడు. అక్కడున్న చీకటి కోణాలను వెలికి తీయటానికి తనైదన శైలిలో పరిశోధన ప్రారంభిస్తాడు. వెనక్కి వెళ్లిపోమని వార్నింగ్ ఇచ్చినా అక్కడే ఉంటాయి.

ఇక అక్కడ ఓ గదిలో నిత్య(సాయిపల్లవి)అనే పేషెంట్ ఉంటుంది. ఆమే మొదట్లో మూడు మర్డర్స్ జరిగిన చోట తాడుతో ఆడుకుంటూ కనపడిన ఆమె అని అర్దమవుతుంది. అలాగే ఆమె కోట్ల ఆస్ది ఉన్న  ఓ పెద్ద జమిందారి కుటుంబానికి వారసురాలు అని రివీల్ అవుతుంది. ఆ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నిత్య అక్కడ పిచ్చాసుపత్రిలో బందీగా ఎందుకు ఉంది..ఆ మర్డర్స్ కు ఆమెకు సంభందం ఏమిటి..ఈ యంగ్ సైక్రాటిస్ట్ నంద..అసలు విషయం ఏమిటి అని కూపీ లాగాడా..ఆమెను అక్కడ నుంచి విముక్తి చేయగలిగాడా, అసలు ఆ అసుపత్రిలో జరుగుతున్నదేమిటి..ఫైనల్ గా జరిగిందేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కేరళలో 1970లలో వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది.ఒక్కో సస్పెన్స్ మెట్టూ పేర్చుకుంటూ స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్లారు. అయితే అతుల్ కులకర్ణి పాత్ర వచ్చేదాకా కథలో థ్రిల్స్ మొదలుకావు. థ్రిల్లర్ జానర్ పూర్తి న్యాయం చేస్తూ కథలోకి వెళ్లటం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అయితే ఇలాంటి సినిమాలు మళయాళంలో రాలేదా అంటే ఎనభై, తొంబైల్లో పిచ్చాసుపత్రి బ్యాక్ డ్రాప్ లో ‘Ulladakkam’, ‘Thalavattam’ వచ్చాయి.  అయితే ఇది ఈ తరానికి నచ్చే సినిమా.ఈ  సినిమాతో పరిచయమైన దర్శకుడు వివేక్..కళ్లకు కనపడని,మనస్సుకు వినపడని సీక్రెట్ ని కథలో పెట్టి థ్రిల్ చేద్దామనే ప్రయత్నించారు. అందులో చాలా భాగం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే థ్రిల్లర్స్ రెగ్యులర్ గా చూసే వాళ్లు క్లైమాక్స్ ఊహించేస్తారు.సైక్లాజికల్ థ్రిల్లర్ అయినా హారర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కొత్త ఎక్సపీరియన్స్ ఇవ్వటానికి ప్రయత్నం చేసారు. అలాగే ఈ కథలో అద్బుతమైన లొకేషన్స్, ఓ రేంజిలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్,కెమెరా వర్క్ కూడా సినిమాలో పాత్రలలాగే అనిపిస్తాయి. అంతా బాగానే అనిపించినా కొన్ని పాత్రలకు లూజ్ ఎండ్స్ తో ముగించటం ఇబ్బందిగా అనిపిస్తుంది.
 
ఎవరెలా చేసారు..

 సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించటం మనకు ఏదో పరాయి భాషా చిత్రం చూస్తున్న ఫీల్ రాదు. అలాగే సాయి పల్లవి ఎక్కడా డైలాగులు లేకుండా కేవలం తన హావభావాలతో మన అటెంక్షన్ ని గ్రాబ్ చేయటం మాత్రం ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విశేషం. అలాగే  పంచంలోని అతి ప్రాచీన మార్షల్ ఆర్ట్‌గా  గుర్తింపు ఉన్న ‘కలరిపయట్టు’ కళకు సంభందించిన సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ఫహద్ ఫాసిల్ పాత్రకు హీరో తరుణ్ చేత డబ్బింగ్ చెప్పించారు. ఫెరఫెక్ట్ యాప్ట్ గా ఉంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంది. 

ఫైనల్ థాట్

ఓ 'పజిల్' లాంటి సినిమా, సాయి పల్లవి ఉంది కదా అని ఫిదా అని ఎక్సపెక్ట్ చేస్తే దారుణంగా దెబ్బ తింటారు.

Rating:3
----సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు..
బ్యానర్‌ : జయంత్‌ ఆర్ట్స్‌ 
 నటీనటులు :సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు 
మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి,
 పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, 
ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, 
కెమెరా: అను మోతేదత్‌,
 స్క్రీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, 
నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, 
సంగీతం: పి.ఎస్‌. జయహరి,
 ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీనివాస్,  
నిర్మాతలు:  అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్;
పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి, 
రన్ టైమ్:  2గం|| 16ని||
ఓటీటీ:ఆహా
 దర్శకత్వం: వివేక్‌
విడుదల తేదీ: 28,మే 2021

Follow Us:
Download App:
  • android
  • ios