Asianet News TeluguAsianet News Telugu

సాయి తేజ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

సాయి ధరమ్ ఓ కొత్త దర్శకుడి స్క్రిప్టు ఓకే చేసారు. ఆ సినిమా టైటిల్ గా భగవద్గీత సాక్షిగా అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారట.ఆ టైటిల్ వినే సగం సాయి తేజ పడ్డారట. ఆ తర్వాత యాక్షన్ తో సాగే ఆ కథ తనకు మరో పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. 
 

Sai Dharam Tej Next Movie Title As Bhagavad Gita Sakshiga
Author
Hyderabad, First Published Jul 16, 2020, 12:17 PM IST

టైటిల్ తోనే సగం సక్సెస్ వచ్చేస్తుంది ఏ సినిమాకైనా. జనాల్లో బాగా నానిన పదాలు, వాక్యాలతో ఈ టైటిల్స్ రెడీ చేస్తూంటారు. టైటిల్ ఎంతబాగా జనాల్లోకి వెళితే అంతలా సినిమా క్రేజ్ వస్తుంది. బిజినెస్ అవుతుంది. ఓపెనింగ్స్ వస్తాయి. ఈ విషయం బాగా స్టడీ చేసినట్లున్నాడు సాయి తేజ. అందుకే తన తాజా చిత్రానికి ఓ డిఫరెంట్ టైటిల్ ని పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

అందుతున్న సమాచారం ప్రకారం...  సాయి ధరమ్ ఓ కొత్త దర్శకుడి స్క్రిప్టు ఓకే చేసారు. ఆ సినిమా టైటిల్ గా `భగవద్గీత సాక్షిగా` అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారట.ఆ టైటిల్ వినే సగం సాయి తేజ పడిపోయాడట. ఆ తర్వాత యాక్షన్ తో సాగే ఆ కథ తనకు మరో పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. 

ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కథ అని సమాచారం. ఠాగూర్ మధు నిర్మించనున్నారు. భగవద్గీత సాక్షిగా అనే టైటిలే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం ధరమ్ తేజ్ సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే మూవీ చేస్తున్నారు. అనంతరం దేవా కట్టాతో ఓ మూవీ చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios