Asianet News TeluguAsianet News Telugu

`ఆర్‌ఆర్‌ఆర్‌` అప్‌డేట్‌ః ఎన్టీఆర్‌ అడిగినందుకు, రాజమౌళి కుమారుడిపై రామ్‌చరణ్‌ అసహనం..

 ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ డ్రమ్‌ ప్రాక్టీస్‌ చేయాల్సి ఉందని తెలుస్తుంది. అయితే సోమవారం ఓ చిన్న వీడియో క్లిప్‌ని పంచుకుంది టీమ్‌. ఇందులో `చరణ్‌ డ్రమ్స్ ప్రాక్టీస్‌ అయ్యిందా? ` అని తారక్‌ అడిగాడు.

rrr update ntr just asking ramcharan fire on rajamouli son
Author
Hyderabad, First Published Aug 9, 2021, 2:26 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా సందడి కొనసాగుతుంది. ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలని రాజమౌళి టీమ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌ వైరల్‌గా మారింది. సినిమాపై అంచనాలను పెంచింది. మరోవైపు సినిమాకి సంబంధించి రోజూ ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తున్నారు జక్కన్న. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఉక్రెయిన్‌లో జరుగుతుంది. అక్కడో సాంగ్‌ షూట్‌ చేస్తున్నారు. 

ఈ సాంగ్‌కి సంబంధించి డ్రమ్‌ ప్రాక్టీస్‌ సేషన్‌ జరుగుతుందట. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ డ్రమ్‌ ప్రాక్టీస్‌ చేయాల్సి ఉందని తెలుస్తుంది. అయితే సోమవారం ఓ చిన్న వీడియో క్లిప్‌ని పంచుకుంది టీమ్‌. ఇందులో `చరణ్‌ డ్రమ్స్ ప్రాక్టీస్‌ అయ్యిందా? ` అని తారక్‌ అడిగాడు. దానికి అయిపోయిందని చరణ్‌ చెప్పాడు. నిజమైన డ్రమ్స్ ఎక్కడ అని రాజమౌళి సన్‌ కార్తికేయని నిలదీశాడు చరణ్‌. `కాస్ట్యూమ్స్ లేవు, ఏం లేవు.. పొద్దు పొద్దునే తీసుకు వచ్చి కూర్చోబెట్టారు.. దసరాకి రావాలంటే.. ` అంటూ చరణ్‌ ఫైర్‌ అయ్యాడు. 

ఎదురుగా ఉన్న కార్తికేయ నెమ్మదిగా `వస్తున్నాయి. రెండు నిమిషాలు.. `అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఎట్టకేలకు జక్కన్న టీమ్‌ స్పందించింది. రామ్‌చరణ్‌ అసహనాన్ని గమనించి వెంటనే డ్రమ్స్ అరెంజ్‌ చేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తెలియజేస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌` ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ డ్రమ్స్ వాయిస్తున్నారు. ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్‌, ఒలివియా మోర్రీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేయబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios